హైదరాబాద్: ఎమ్మెల్యేల ఎర కేసులో న్యాయవాది శ్రీనివాస్ ఏసీబీ ప్రత్యేక కోర్టులో ఊరట లభించింది. శ్రీనివాసును నిందితుడిగా చేరుస్తూ మొయినాబాద్ పోలీసులు దాఖలు చేసిన మెమోను కోర్టు కొట్టివేసింది. మంగళవారం ఉదయం ఫార్మ్ హౌస్ కేసుపై ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. 23న సిట్ ధాఖలు చేసిన మెమోపై కోర్టు విచారించింది. కేసులో ఏ4గా సంతోష్ జి, ఏ5గా తుషార్, ఏ6 జగ్గు స్వామి, ఏ7 శ్రీనివాస్‌లను చేర్చాలని సిట్ మెమో దాఖలు చేసింది. కాగా మెమోపై నిందితుల తరపు లాయర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. మెమో ద్వారా నిందితులను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చే ప్రోసీడింగ్ లేదంటూ వాదనలు వినిపించారు. ఈ క్రమంలో శ్రీనివాస్ తరపు లాయర్ వాదనతో ఏసీబీ ప్రత్యేక కోర్టు ఏకీభవిస్తూ.. సిట్ వేసిన మెమోను కొట్టివేసింది.