హైదరాబాద్: ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ లో బలపడిన అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి ఈ రోజు సాయంత్రానికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ తరుణంలో ఎల్లుండి ఉదయానికి తుఫానుగా మారుతుందని ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి ఆనుకుని ఉన్న దక్షిణకోస్తాంధ్ర తీరాలకు చేరుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో దక్షిణకోస్తాలోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, రాయలసీమలోని చిత్తూరు, కడప, అన్నమయ్య ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని, మిగిలిన చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అయితే మాండూస్ తుఫాన్ ఎఫెక్ట్‌తో తమిళనాడుకు రెడ్ అలెర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ చెన్నై, కడలూరు, కన్యాకుమారి సహా ఆరు జిల్లాలకు ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి ఈ నెల 10వ తేదీ వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లద్దని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు.