హైదరాబాద్: నిజామాబాద్ ఆర్మూర్ ఆస్పత్రిలో మంత్రి హరీష్‌రావు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. అక్కడి రోగులతో మాట్లాడారు. డాక్టర్లు, వైద్య సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ తరుణంలో మంత్రి మాట్లాడుతూ ఆర్మూర్ ఆస్పత్రిలో మందుల కొరత లేదన్నారు. ఆస్పత్రిలో ఇప్పటికే జరిగిన 22,670 ఉచిత ప్రసవాలు జరగడం సంతోషమని, వారం పదిరోజుల్లో డయాలిసిస్ సెంటర్, అతి త్వరలో డాక్టర్లు, వైద్య సిబ్బంది ఖాళీలు భర్తీ చేస్తామని తెలిపారు. నార్మల్ ప్రసవాలు ప్రోత్సహించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. నెలకు 500 ఫ్రీ డెలివరీలు జరగాలని టార్గెట్ విధించారు.