హైదరాబాద్: తెలంగాణ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో ఉద్యోగాల్లో 1147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసినట్లు హరీశ్‌రావు ట్వీట్ ద్వారా తెలిపారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో 1147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హులైన అభ్యర్థుల నుంచి ఈ నెల 20న ఉదయం 10:30 గంటల నుంచి జనవరి 5వ తేదీన సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు.