నవతెలంగాణ - హైదరాబాద్ వైఎస్ వివేకా నంద రెడ్డి హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇక ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సిబిఐ కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నాడు అవినాష్ రెడ్డి. ఈ నేపథ్యంలో తాజాగా వైఎస్ విజయమ్మతో సమావేశమయ్యారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి. వైఎస్ విజయమ్మతో లోటస్ పాండ్ లో ఎంపీ అవినాష్ రెడ్డి సమావేశమయ్యారు. సీబీఐ విచారణకు ముందు.. విజయమ్మతో లోటస్ పాండ్ లో ఎంపీ అవినాష్ రెడ్డి సమావేశం కావడం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.