రాష్ట్రాన్ని, ప్రజలను కేంద్రం వద్ద జగన్ తాకట్టు పెట్టారు: రామ్మోహన్ నాయుడు
Wed 01 Feb 20:41:59.13049 2023
నవతెలంగాణ-హైదరాబాద్ : అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి జగన్ ప్రజా సమస్యలపై ఒక్క సమావేశం కూడా పెట్టలేదని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శించారు. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వద్ద రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను జగన్ తాకట్టు పెట్టారని విమర్శించారు. విభజన హామీలు, రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని జగన్ ఒక్క రోజైనా నిలదీశారా? అని ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్ కు ముందు ఎంపీలతో ఒక్క మీటింగ్ అయినా పెట్టారా? నిలదీశారు. బడ్జెట్ కు సంబంధించి ఏం అడగాలనే దానిపై వైసీపీ ఎంపీలకు ఒక్క సూచన అయినా చేశారా? అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చామని గుర్తు చేశారు.