నవతెలంగాణ - జమ్మూ కశ్మీర్ జమ్మూ కశ్మీర్ లోయలో భారీగా మంచు కురుస్తున్న దృష్ట్యా నాలుగు జిల్లాల్లో ప్రమాద హిమపాతం హెచ్చరిక జారీ చేశారు. రాబోయే 24 గంటల్లో జమ్మూ కశ్మీర్ లోయలోని బారాముల్లా, గందర్‌బల్, కుప్వారా, బండిపొర మీదుగా 2,400 మీటర్ల ఎత్తులో ప్రమాద స్థాయితో హిమపాతం సంభవించే అవకాశం ఉంది’’ భారత వాతావరణశాఖ హెచ్చరించింది.గుల్‌మార్గ్ ఎగువ ప్రాంతాల్లో భారీ హిమపాతం వల్ల ఇద్దరు మరణించారు. నాలుగు జిల్లాల్లో భారీ హిమపాతం సంభవించే ప్రాంతాలకు ప్రజలు వెళ్లవద్దని సూచించామని ఐఎండీ అధికారులు తెలిపారు.బారాముల్లా జిల్లాలోని గుల్‌మార్గ్ ప్రాంతంలో హిమపాతం కారణంగా ఇద్దరు మరణించారు. మరో 19 మంది విదేశీ పర్యాటకులను అధికారులు రక్షించారు.