నవతెలంగాణ - న్యూయార్క్ అమెరికాలోని దక్షిణాది రాష్ట్రాల్లో మూడు రోజులుగా అతిశీతల పరిస్థితులు కొనసాగుతున్నాయి. టెక్సాస్ మొదలుకొని వెస్ట్ వర్జీనియా వరకు భారీగా కురిసిన మంచు వడగండ్ల వానతో జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. రహదారులపై వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. మంచు వాన కారణంగా జరిగిన ప్రమాదాల్లో ఆరుగురు మరణించారు. వాహనదారులు రోడ్లపైకి వెళ్లవద్దంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. బుధవారం ఉదయం 1,400 విమాన సర్వీసులు రద్దయ్యాయి. డల్లాస్, ఆస్టిస్, టెక్సాస్, నాష్‌విల్లె, టెన్నెస్సీ విమానాశ్రయాల్లో విమానాలు నిలిచిపోయాయి. ప్రమాదకర అతిశీతల వాతావరణంతో డల్లాస్, మెంఫిస్, టెన్నెస్సీల్లో స్కూళ్లు మూతబడ్డాయి. లక్షలాది మంది విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. అర్కాన్సస్‌లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.