నవతెలంగాణ - న్యూఢిల్లీ అదానీ గ్రూపు సంస్థలపై అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ ఇచ్చిన నివేదికపై తక్షణమే చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు నేడు రాజ్యసభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. దేశ ప్రజలు, దేశ ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం చూపే రీతిలో ఆ నివేదిక ఉన్నట్లు ఎంపీ కేశవరావు తన వాయిదా తీర్మానం లేఖలో పేర్కొన్నారు. రూల్ 267 కింద చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ నేత కోరారు. ఇక లోక్‌సభలోనూ ఇదే అంశంపై చర్చించాలని బీఆర్ఎస్ నేత నామా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. లోక్‌సభలో కూడా వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు.