- సర్వసభ్య సమావేశంలో గలమెత్తిన ప్రజాప్రతినిధులు - ఫవర్ పై ఫైర్ అయిన జండ్రల్ బాడీ - తాగునీటి సమస్య లేకుండా చూడాలి నవతెలంగాణ-చర్ల మూడు మాసాలకు ఓకసారి ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ప్రజాప్రతినిధులు మండల స్థాయి అధికారుల సర్వసభ్య సమావేశం బుధవారం వాడి వేడిగా సాగింది. మండల వ్యాప్తంగా ఉన్న 26 పంచాయతీల అందరూ సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీ, జడ్పిటిసి కలసి ప్రభుత్వ అధికారుల దృష్టికి ప్రజల సమస్యలు తీసుకువెళ్లడానికి స్థానిక మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేస్తే సంబంధిత 30% ప్రభుత్వ ఉద్యోగులు కూడా రాకపో వడంతో ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. ప్రభుత్వ అధికారులే క్రమశిక్షణ రహితంగా వ్యవహరించడం ప్రజల సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని వారు విరుచుకు పడ్డారు. వచ్చే సర్వసభ్య సమావేశానికి ప్రభుత్వ అధికారులు అందరూ రాకపోతే ప్రజాప్రతినిధులం సర్వసభ్య సమావేశాన్ని వాక్ అవుట్ చేస్తామని జెడ్పిటిసి ఇర్పా శాంత మండి పడ్డారు. మహిళా ప్రజాప్రతినిధులు సమస్యలను తీర్చని అధికారులతో నానా అవస్తలకు గురువాల్సి వస్తుందని ముక్తకంఠంతో విమర్శించారు. -ఫవర్ పై ఫైర్ అయిన జండ్రల్ బాడీ : విద్యుత్ సమస్య జటిలంగా ఉందని ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. ఉన్నతాధికారులతో స్థానిక అధికారి సమన్వయం చేసుకోకపోవడం వలన ఎక్కడ సమస్యలు అక్కడ పేరుకొని పోయి విద్యుత్ సరఫరా సమస్య, ట్రాన్స్ఫార్మర్ సమస్యతో పాటు పలు సమస్యలు ప్రజాప్రతినిధులు ప్రశ్నించగా ఆ సమస్యలు నా పరిధిలో లేవని చెప్పడం ఉన్నత అధికారులతో సమన్వయ లోపం తెలియకనే తెలుస్తుందని జెడ్పిటిసి అన్నారు. విద్యుత్ సరఫరా సమస్య ఎక్కువగా ఉందని ఎంపీటీసీలు, సర్పంచులు సైతం ముక్తకంఠంతో అన్నారు. - వచ్చే వేసవిలో త్రాగునీటి సమస్య ఉండవద్దు : రాబోయే వేసవిలో తాగునీటి సమస్య లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ఎంపీపీ గీద కోదండరామయ్య అన్నారు. మండల వ్యాప్తంగా మిషన్ భగీరథ తాగునీటి సమస్య జటిలంగా ఉందని వచ్చే వేసవిలో ఎక్కడ తాగునీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలని ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులకు సూచించారు. గుత్తి కోయ విద్యార్థులకు కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలని సర్వసభ్య సమావేశం తీర్మానం చేసింది అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన లంబాడీలకు రుద్రువీకరణ పత్రాలు నిలుపుదల చేయాలని తాసిల్దార్ బి. భరణి బాబును ప్రజాప్రతినిధులు కోరారు. చాలా సమస్యలపై ప్రజాప్రతినిధులు అధికారులను నిలదీశారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామ పంచాయతీల సర్పంచులు, ఎంపీటీసీలు అధికారులు పాల్గొన్నారు.