- సీపీఐ(ఎం) నేతలు భూక్యా వీరభద్రం, మెరుగు సత్యనారాయణ నవతెలంగాణ-కొణిజర్ల ప్రజా సమస్యలు పరిష్కారం కమ్యూనిస్టులతోనే సాధ్యమని, కమ్యూనిస్టులు బలపడితేనే ప్రజల హక్కులు కాపాడబడతాయని, ప్రజలందరూ ప్రజా పోరాటాలో కలిసి రావాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భూక్యా వీరభద్రం, జిల్లా కమిటీ సభ్యులు మెరుగు సత్యనారాయణ తెలిపారు. సిపిఎం ఏన్కూరు మండల కమిటీ విస్తృత సమావేశం ఏర్పుల రాములు అధ్యక్షతన స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగింది సమావేశంలో వారు మాట్లాడుతూ రైతాంగ సమస్యలు పోడు భూముల సమస్యలు కమ్యూనిస్టుల వల్లనే పరిష్కారం అవుతుందని, కార్మిక కర్షక ఐక్యతతో మతోన్మాద బిజెపిని ఓడించడానికి భవిష్యత్తులో లౌకికశక్తులను కలుపుకొని ముందుకు సాగుతామన్నారు. వైరా నియోజక వర్గంలో బలమైన రాజకీయ పార్టీగా సిపిఎం ముందుకు సాగుతుందని అందరూ ఆదరిం చాలని కోరారు. డిసెంబర్ 29న ఖమ్మంలో జరుగు బహిరంగ సభకు మండలం నుంచి వేలాదిగా తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు బానోతు బాలాజీ, మండల కార్యదర్శి దొంతబోయిన నాగేశ్వరరావు, ఇటికల లెనిన్, రేపల్లెవాడ ఎంపీటీసీ సభ్యులు భూక్యా లచ్చు నాయక్, నండూరి శ్రీనివాసరావు, షేక్ జానీ, రవి, రాంచందర్రావు, వెంకటేశ్వర్లు, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.