ఖమ్మం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్‌లో 5వ వరకు విశిష్ట ఆభరణాల ప్రదర్శన
Sat 03 Dec 00:59:56.837473 2022
- డాక్టర్ స్వప్న, మార్కెటింగ్ మేనేజర్ శ్రీనివాస్ నవతెలంగాణ- ఖమ్మం ఖమ్మంలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో శుక్రవారం నుండి ఈనెల 5వ తేదీ వరకు ఒక విశిష్ట ఆభరణాల ప్రదర్శన ఉంటుందని డాక్టర్ స్వప్న, మార్కెటింగ్ మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం ఖమ్మంలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో ప్రదర్శన అండ్ అమ్మకాలను ప్రారంభిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంగారం, వజ్రాభరణాలు, జాతి రత్నాభరణాలను ప్రదర్శిస్తున్నామని, ఈ ఆభరణాలు అద్వితీయమైన కళానైపుణ్యతతో అంతులేని హుందాతనంతో కూడినవి అన్నారు. నగిపి చెక్కిన ప్రతి ఆభరణం తయారు చేసిన వారి అనుభవం ఇంకా కళాత్మకతకి నిదర్శనంగా నిలుస్తుందన్నారు. జాతిరత్నాభరణాల సముదాయం 'ఎత్నిక్స్'' హస్తకళా నైపుణ్యతతో తయారైన ఆభరణాలు, ''జోల్ అధునాతన కారెట్ల బంగారం మార్పిడిపై 0.5 శాతం తగ్గింపును పొందవచ్చు అని అన్నారు. వజ్రాభరణాలు, వివాహం, పార్టీ సంబరాల కోసం, ''ఎరా'' అన్కల్ వజ్రాలతో పొదిగిన విశిష్ఠ శ్రేణి, ప్రెప్యా డిజైన్లతో తేలికపాటి ఆభరణాలను ఇష్టపడే మగువల మనసులు దోచుకుంటాయని, ''డివైన్'' భారతీయ ప్రాచీన సంప్రదాయం వ్యక్తం చేసే ఆభరణాలు ఇంకా చిన్నారుల కోసం 'స్టార్లెట్' పిల్లల ఆభరణాలు సమకూర్చారన్నారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నిబద్ధతలో భాగంగా, తను వినియోగదారులకు 10 న్యాయమైన వాగ్దానాలను అందిస్తుందని, కచ్చితమైన తయారీ ధర, రాళ్ల బరువు, నికర బరువు, ఆభరణాల రాళ్ల విలువతో కూడిన పారదర్శక ధరల పట్టి, ఆభరణాలకు జీవితకాల ఉచిత నిర్వహణ, పాత బంగారు ఆభరణాలను తిరిగి విక్రయించేటప్పుడు బంగారానికి 100 శాతం విలువ, బంగారం మార్పిడిపై శూన్య తగ్గింపు నూరు శాతం బి.ఐ.ఎస్ హాల్ మార్కుతో ధ్రువీకరించబడిన స్వచ్ఛమైన బంగారం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 28 పాయింట్ల నాణ్యత పరీక్షలు నిర్వహించిన ఐజెఐ, జెఐఎ ధ్రువీకరించిన వజ్రాభరణాలు, బైబ్యాక్ గ్యారెంటీ, నాణ్యతను తనిఖీ చేయడానికి క్యారెట్ ఎనలైజర్, జీవితకాల నిర్వహణ, బాధ్యతాయుతమైన మూలాల నుండి బంగారం సేకరణ వంటి వాగ్దానాలను అందిస్తుందన్నారు.