- రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసాని నవతెలంగాణ-సుజాతనగర్ కేంద్ర ప్రభుత్వం పత్తికి మద్దతు ధర రూ.12 వేలు ప్రకటించాలని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసాని ఐలయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం మండల పరిధిలోని పత్తి యార్డును రైతు సంఘం నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ వే బ్రిడ్జి కాటాలలో ఎటువంటి అవకతవకలు జరగకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కోరారు. వే బ్రిడ్జ్ కొలతలలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పత్తి యార్డుకు వచ్చే రైతులకు టెంట్లు, కుర్చీలు, తాగునీరు వంటి వసతులు కల్పించాలని వ్యాపారస్తులకు సూచిం చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి ఉడుగుల శ్రీకాంత్ , మండల కమిటీ సభ్యులు కొండే కృష్ణ, పుల్లయ్య, ఏడుకొండలు, బాలు, వెంకటే శ్వర్లు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.