నవతెలంగాణ-కొత్తగూడెం సింగరేణి కాలరీస్ సంస్థలో అనేక ఏళ్లుగా వివిధ హౌదాలో సంస్థకు సేవలందించి, మంగళవారం పదవి విరమణ చేస్తున్న డైరెక్టర్ చంద్రశేఖర రావును సీఐటీయూ యూనియన్ ప్రైవేట్ డ్రైవర్స్ అధ్యక్షుడు జి.శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో డైరెక్టర్‌ను కలిసి ఘనంగా సన్మానించారు. ఇంత కాలం సింగరేణి సంస్థకు విలువైన సేవలు అందించినందుకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ విష్ణు, కమిటీ మెంబర్ ఉదరు, కోటి తదితరులు ఉన్నారు.