- మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రంలో కార్మికుల ధర్నా నవతెలంగాణ-పాల్వంచ మిషన్ భగీరథలో పనిచేస్తున్న కార్మికులను సమస్యలను పరిష్కరించి రెగ్యులరైజ్ చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు గద్దల శ్రీనివాస్, సహాయ కార్యదర్శి కే.సత్య డిమాండ్ చేశారు. మంగళవారం పాల్వంచ మండలంలోని తోగ్గూడెంలో ఉన్న మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రంలో ధర్నా నిర్వహించారు. ప్లకార్డులు పట్టుకొని కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఈ కార్యక్రమంలో గద్దల శ్రీనివాసరావు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు సత్య, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి, జేఏసీ నాయకులు కే.వెంకన్న, నరేష్ బాబు, బిఎస్పి బహుజన లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.