వ్యవసాయానికి పగటిపూట నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలి
Thu 02 Feb 00:42:45.289717 2023
నవతెలంగాణ-కూసుమంచి వ్యవసాయానికి పగటిపూట 12 గంటలు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని బుధవారం కూసుమంచి విద్యుత్ శాఖ ఏడి కోక్యా నాయక్‌ను తెలంగాణ రైతు సంఘం మండల కమిటీ సభ్యులు కలిసి మెమోరాండం ఇవ్వటం జరిగింది. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు మల్లెల షణ్మతరావు, ఎడవల్లి రమణారెడ్డి, రైతు సంఘం మండల కార్యదర్శి గంగాధర్, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి మాడు గన్యా నాయక్, పాల్గొన్నారు.