Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • గొడ్డలితో భార్య-కూతురిని నరికి చంపేశాడు..
  • తెలంగాణ టీమ్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా: చంద్రబాబు
  • టోల్ చార్జెస్ పెంపుపై నితిన్ గడ్కరీకి లేక రాసిన మంత్రి వేముల
  • ఏప్రిల్ 25 నుంచి సమ్మర్ హలీడేస్..
  • రద్దు చేసిన ఏఈఈ నియామక పరీక్షల తేదీలు ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
వర్గ విభేదాలతో వైరా మునిసిపాలిటీకి నిధులు నిల్‌ | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి

వర్గ విభేదాలతో వైరా మునిసిపాలిటీకి నిధులు నిల్‌

Thu 02 Feb 00:42:45.289717 2023

- ఎమ్మెల్యే, చైర్మన్‌, వైస్‌ చైర్మన్లపై కౌన్సిలర్ల ధ్వజం
- చైర్మన్‌ పార్టీ మారితే
అవిశ్వాస తీర్మానం పెడతాం
- కాని అంతకంటే ముందే
మున్సిపాల్టీకి రూ.30 కోట్లు ఇవ్వాలి
- వైరా అభివృద్ధి నిరోధకానికి అందరూ బాధ్యులే
- రహస్య సమావేశంలో కౌన్సిలర్లు

నవతెలంగాణ-వైరా
              వైరా నూతన మునిసిపాలిటీపై ప్రభుత్వం, జిల్లా ప్రజా ప్రతినిధులు కపటప్రేమ చూపించి ప్రకటించిన నిధులు మంజూరు చేయటం లేదని మునిసిపల్‌ కౌన్సిల్‌ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. బుదవారం మునిసిపల్‌ పరిదిలోని సోమవరం గ్రామంలో ఒక మామిడి తోటలో రహస్య సమావేశం నిర్వహించారు. సమావేశంలో చైర్మన్‌ సూతకాని జైపాల్‌, వైస్‌ చైర్మన్‌ ముల్లపాటి సీతారాములు ఎన్నికైన పురుష అభ్యర్థులు, మహిళా సభ్యుల భర్తలు సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నిధులు ఖమ్మం కార్పొరేషన్‌ 2 వేల కోట్లు, సత్తుపల్లి మునిసిపాలిటీ 60 కోట్లు, ఇల్లందు 29 కోట్లు, మధిర 15 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం వైరా మునిసిపాలిటీకి ప్రకటించిన 30 కోట్ల రూపాయలను ఎందుకు విడుదల చేయలేదని సభ్యులు ప్రశ్నించారు. వైరా మునిసిపల్‌ చైర్మన్‌ పార్టీకి ఎదురు తిరిగిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుడు అయినందున నిధులు ఆపారా అని కూడా ప్రశ్నించారు. మునిసిపాలిటీ అభివృద్ధి చెందకపోవటానికి కారణం జిల్లా మంత్రి, ఎమ్మెల్యే, చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లే కారణమని సభ్యులు విరుచుకుపడ్డారు. రహస్య సమావేశం అని ఎవరికి వారు చెప్పినా అందరూ అక్కడ జరిగిన విషయాలను బహిర్గతం చేశారు. వైరా మునిసిపాలిటీ తెలంగాణ లో ఉందా, లేదా అన్నది సభ్యుల ప్రధాన ప్రశ్న. 2018 లో మునిసిపాలిటీ ఏర్పడ్డ తొలినాళ్లలో ఇచ్చిన అర్భన్‌ డెవలప్మెంట్‌ నిధులు 20 కోట్లు మినహా వైరాకు ఏ నిధులిచ్చారని ప్రశ్నించారు. చైర్మన్‌ సహితం నిధులు రాని మాట నిజమేనని, వైరా సమగ్ర వెజ్‌, నాన్‌ వెజ్‌ మార్కెట్‌ ఎలా వచ్చిందో, ఎవరు కాంట్రాక్టరో, నేటివరకు మునిసిపాలిటీ కి తెలియని దుస్థితి ఉన్నదని చైర్మన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం మునిసిపాలిటీలో అదనపు విద్యుత్‌ స్తంభాలకు 78 లక్షలకు ఎస్టిమేషన్‌ వేసి తీర్మానం చేస్తే ఒక్క రూపాయి రాదని అన్నారు. సమావేశంలో ఇద్దరు కాంగ్రెస్‌ సభ్యులు తప్ప 18 మంది బిఆర్‌ఎస్‌ సభ్యులే. అయినా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో తమ నిరసన వ్యక్తం చేశారు. ఒకరిద్దరు సభ్యులు బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కాదు వార్డుల్లో ఇప్పటి వరకు మేము చేసిన పనులేమిటి? వార్డు ప్రజలకు సమాధానం ఏమి చెప్పాలి? ఎంతకాలం చెప్పాలనే ఆవేదన వ్యక్తం చేశారు. అర్బన్‌ డెవలప్మెంట్‌ రెండవ విడత నిధులు 30 కోట్లు ఎందుకు విడుదల కావటం లేదని, అందుకు కారకులు ఎవరనే విషయం తేల్చుకోవాలని నిర్ణయించారు. 30 కోట్లు విడుదల అయితే వాటిని ఎలా ఖర్చు చేయాలో, ఏ వార్డులో ఏ అభివృద్ధికి ఖర్చు చేయాలో కౌన్సిల్‌ లో చర్చ జరగాలని అన్నారు. పై నుంచి మనపై అభిప్రాయాలు రుద్దితే కుదరదని నిర్ణయించారు. ఖమ్మం ఎంపి నామా నాగేశ్వరరావు వైరా మునిసిపాలిటీ సభ్యుల్లో కొందరికి 10 లక్షల చొప్పున నిధులు మంజూరు చేయటం ఏమిటని, పార్లమెంటరీ నియోజకవర్గ అభివృద్ధి నిధులు మున్సిపాలిటీకి ఇస్తే కౌన్సిల్‌ తీర్మానం ప్రకారం పనులు జరుగుతాయని, కాని వారికి ఇష్టం వచ్చిన వారికి నిధులు మంజూరు చేయటం ఏమిటని కూడా సభ్యులు సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో పొంగులేటి పార్టీ మార్పిడి విషయాలు కూడా హాట్‌ హాట్‌ గా సాగినవి. చైర్మన్‌ సూత కాని జైపాల్‌ పార్టీ మారితే అతనిపై అవిశ్వాస తీర్మానం సమస్య తలెత్తితే, మునిసిపాలిటీ కి రావలసిన, ఇంకా జరగవలసిన అభివద్ధికి నిధులు ముందుగా ఇస్తేనేనని ఘంటా పదంగా చెబుతున్నారు. ఈ సమావేశం ప్రభుత్వ వ్యతిరేక సమావేశంగా మారింది. మునిసిపాలిటీ విలీన గ్రామాల ప్రజలు తమను ఎందుకు విలీనం చేశారని నిలదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. గతంలో భూములు, ఇళ్లు అమ్ముకోవటానికి ఏ నిబంధనలు అడ్డు రాలేదని, ఇప్పుడు అడుగడుగునా అడ్డంకులే నని, ప్రజలడిగే ప్రశ్నలకు సమాధానం లేదని వాపోయారు. వైరా మునిసిపాలిటీ అభివృద్ది నిరోధకానికి జిల్లా మంత్రి, వైరా ఎమ్మెల్యే, బిఆర్‌ఎస్‌ అధ్యక్షులు, ఎమ్మెల్సి, ఎంపి, సుడా అందరూ బాధ్యులేనని ప్రభుత్వ వ్యతిరేక తీర్మానం చేశారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నాణ్యతలేని బంకర్ల నిర్మాణం
రైతుల అభివృద్ధికి సహకార సంఘం
అంతర్జాతీయ జీరో వ్యర్థ దినోత్సవం ర్యాలీకి ఇల్లందు, పీర్జాదిగూడ ఎంపిక
పోలీస్‌ అభ్యర్థులకు మెటీరియల్‌ అందజేత
కోనోకార్పస్‌ మొక్కలు తొలగించాలి
రాహుల్‌ గాంధీకి న్యాయం జరిగేంత వరకు పోరాటం
హమాలీల సమస్యలు పరిష్కరించకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తాం
రాములోరి కల్యాణానికి సర్వం సిద్ధం
పిల్లల ఎదుగుదలకు చిరుధాన్యాలు
ఫోర్జరీ సంతకాలతో ఇంటి పర్మిషన్లు
అర్హులైన వారికి డబుల్‌ ఇండ్లు ఇవ్వాలి
కల్యాణ మహౌత్సవం...అంగరంగ వైభవంగా తెప్పోత్సవం
ఉమ్మనేని సేవా ఫౌండేషన్‌,సీపీఐ(ఎం) గ్రామ శాఖ సహకారం
మిషన్‌ భగీ'వ్యథ'లపై ఆగ్రహం
ఎన్నికల సామగ్రి జాగ్రత్త : కలెక్టర్‌
దళిత బంధు సద్వినియోగం చేసుకునేలా పర్యవేక్షణ
పేదల సమస్యలపై సూరమ్మ నిరంతరం పోరాటం
పత్తి వ్యాపారుల జీఎస్టీ సమస్య పరిష్కారం
హమాలీ సమస్యల పరిష్కారమయ్యే వరకు పోరాడుదాం
డబుల్‌ ఇండ్ల లబ్దిదారుల ఎంపికలో వచ్చిన అభ్యంతరాలపై విచారణ జరపాలి
భక్తులు పాటించాల్సిన జాగ్రత్తలపై ఆడియో ఆవిష్కరణ
పలు కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే
కార్యకర్తలకు అండగా సీపీఐ(ఎం)
ఎస్సీ ఉద్యోగుల సంక్షేమంలో సింగరేణి సంస్థ అందరికీ ఆదర్శప్రాయం
జెడ్పీ అభివృద్ధి నిధులు ప్రణాళిబద్దంగా వినియోగించాలి
పోషకాహారంతోనే తల్లీబిడ్డలు ఆరోగ్యం
29న జన చైతన్య యాత్ర ముగింపు సభ
భద్రాచలానికి వీఐపీల తాకిడి
పర్ణశాల వాహన పార్కింగ్‌ వేలం పాట రూ.26.60 లక్షలు
భూములు కోల్పోయిన రైతులకు పరిహారమివ్వాలి
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.