Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • ఫోన్ చూడొద్దని కసురుకున్న తల్లి.. కూతురు ఆత్మ‌హత్య‌
  • ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
  • ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌ కప్‌..టీమిండియాకు తొలి ఓటమి
  • భారీ భూకంపాల్లో తల్లడిల్లుతున్న టర్కీ, సిరియా..
  • ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ పై తొలిసారి యుద్ధనౌక ల్యాండింగ్‌..
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
హింసను అంతం చేద్దాం | మానవి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మానవి
  • ➲
  • స్టోరి

హింసను అంతం చేద్దాం

Fri 25 Nov 06:09:22.050434 2022

''ఒక దేశ మహిళ స్థితిగతులను చూసి ఆ దేశ పరిస్థితిని ఇట్టే చెప్పేయవచ్చు'' అన్నారు జవహర్‌లాల్‌ నెహ్రూ. ఒక దేశ మహిళలు ఆ దేశం నాగరికతకు ప్రతిబింబం వంటి వారు. నాగరికత ఆరంభం అయిననాటి నుంచి భారతీయ మహిళలకు ఎంతో గుర్తింపు, ప్రాముఖ్యం వుంది. దేశ జనాభాలో దాదాపు సగం సంఖ్య మనది. వివిధ రూపాలలో జాతీయ, ఆర్థిక పురోగతిలో మనదైన పాత్ర పోషిస్తున్నాము. మహిళలు మంచి స్థాయిని అనుభవిస్తున్నారంటే అక్కడి సమాజం సరైన వికాసంతో, బాధ్యతతో ఉన్నదని అర్థం. కాని నేటి సమాజంలో స్త్రీలు అనేక రకాల సమస్యలను, హింసను ఎదుర్కొంటున్నారు. వాటిని రూపుమాపేందుకే
'అంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేక దినం' ఉద్భవించింది. ప్రస్తుతం స్త్రీలపై హింస ఏ స్థాయిలో ఉందో ఈ సందర్భంగా తెలుసుకుందాం.
ప్రస్తుత సమాజంలో స్త్రీలు సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యాపరంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. గృహహింస, లైంగికదాడులు, వేధింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అంతేకాక ఆత్మన్యూనతా భావానికిలోనై స్త్రీలు కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వీటన్నింటినీ అరికట్టే ప్రయత్నంలో 1999 డిసెంబరు 17వ తేదీని ఐక్యరాజ్యసమితి 54/134 తీర్మానాన్ని చేసింది. దీని ప్రకారం ప్రతి సంవత్సరం నవంబరు 25న స్త్రీల హక్కుల పరిరక్షణ, స్త్రీ హింస వ్యతిరేక దినంగా పాటించడం ప్రారంభించింది.
కార్యక్రమాలు చేపట్టేలా
చారిత్రత్మకంగా ఈ రోజు 1960లో డొమైన్‌ రిపబ్లిక్‌లో రాజకీయ కార్యకర్త అయిన మిరాబల్‌ హతతో స్త్రీ హింసా వ్యతిరేక దినంగా పాటించడం జరిగింది. ఈ హత్యలు డొమైన రిపబ్లిక్‌ నియంత అయిన ట్రుజిల్లో(1930-1961)చే 1981లో అజ్ఞాపించబడినవి. ఉద్యమకారులు నవంబరు 15న స్త్రీ హింసా వ్యతిరేకత గూర్చి అవగాహన కల్పించుటకు నిర్ణయించారు. డిసెంబరు 17, 1999న ఈ దినాన్ని అధికారికంగా ఐక్యరాజ్యసమితి తీర్మానించింది. ఐక్యరాజ్యసమితి అంతర్‌ పార్లమెంట్‌ సమాఖ్య అన్ని ప్రభుత్వాలను అంతర్జాతీయ సంస్థలకు, ఎన్‌జీఓలకు ఆ రోజున అంతర్జాతీయ కార్యక్రమంగా మహిళలపై జరుగుతున్న హింసా వ్యతిరేక దినంగా పాటించి కొన్ని కార్యక్రమాలు నిర్వహించాలని ప్రోత్సహించింది. యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ ఫర్‌ వుమెన్‌ ఈ దినాన్ని ప్రతి సంవత్సరం పరిశీలించి కొన్ని సలహాలను ఇతర సంస్థలకు ఇస్తుంది. 2012లో ఈ దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి కార్యదర్శి మూన్‌ సందేశంతో ప్రారంభించబడింది.
నమ్మకాల కారణంగా
మహిళలపై హింససాధారణ గృహహింస, లైంగిక వేధింపులు, హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయి. పురుషాధిక్య సమాజంలో దీర్ఘకాల లింగ అసమానతల ఫలితంగా స్త్రీ తరతరాలుగా అణిచివేతకు గురవుతుంది. గృహసింసను ఇప్పటికీ చాలా మంది అసలు హింసగానే గుర్తించడం లేదు. మన సాంస్కృతిక విలువలు, నమ్మకాల కారణంగా చాలా వరకు హింస అసలు నమోదు కావడం లేదు. చాలామంది మహిళలు కూడా తమ భర్త తమను కొట్టడాన్ని అంగీకరిస్తున్నారు. భారతదేశ జెండర్‌ గ్యాప్‌ ఇండెక్స్‌ రేటింగ్‌ 2022లో 0.629, 146 దేశాలలో 135 ర్యాంక్‌తో ఉంది.
నమోదయిన నేరాలు
నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో ఆఫ్‌ ఇండియా ప్రకారం 2020 సంవత్సరంతో పోలిస్తే 2021లో మహిళలపై నేరాల సంఘటనలు 15.3శాతం పెరిగాయి. 2011లో 228,650 కంటే ఎక్కువ సంఘటనలు నమోదయ్యాయి. 2021లో 4,28,278 సంఘటనలు నమోదయ్యాయి. అంటే 87శాతం పెరిగింది. భారతదేశంలో నివసిస్తున్న మహిళల్లో 7.5శాతం పశ్చిమ బెంగాల్‌లో నివసిస్తున్నారు. ఇక్కడ మహిళలపై నమోదైన మొత్తం నేరాలలో 12.7శాతంగా ఉన్నాయి. దేశంలోని స్త్రీ జనాభాలో 7.3శాతం ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. నమోదైన మొత్తం నేరాలలో 11.5శాతం ఆ రాష్ట్రంలో జరుగుతుంది.
గణాంకాలు పొందడం కష్టం
65శాతం మంది మహిళలు కుటుంబంలోని హింసను సహించాలని నమ్ముతారు. మహిళలు కొన్నిసార్లు దెబ్బలకు అర్హులైనట్టు భావిస్తున్నారు. జనవరి 2011లో ఇంటర్నేషనల్‌ మెన్‌ అండ్‌ జెండర్‌ ఈక్వాలిటీ సర్వే (ఇమేజెస్‌) ప్రశ్నాపత్రం ప్రకారం 24శాతం మంది భారతీయ పురుషులు తమ జీవితంలో ఏదో ఒక సమయంలో లైంగిక హింసకు పాల్పడ్డారు. పెద్ద సంఖ్యలో కేసులు నివేదించబడనందున కేసుల తీవ్రతపై కచ్చితమైన గణాంకాలను పొందడమే చాలా కష్టంగా మారిపోయింది. అలాగే కేసు నమోదు చేడయం వల్ల కుటుంబ గౌరవం దెబ్బతింటుందనే ఒత్తిడి దీనికి కారణం. అంతే కాకుండా చట్టాల్లో కూడా ఎన్నో లొసుగులు మహిళల రక్షణకు అడ్డంకిగా మారాయి. ఫలితంగా మహిళలపై హింస రోజు రోజుకు పెరిగిపోతుంది.
వరకట్న మరణాలు
వరకట్నానికి సంబంధించిన హత్యలు, మరణాలు మన దేశంలో జరుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో భర్తలు, అత్తమామలు నిరంతర వేధింపులకు గురించేస్తూ చిత్రహింసల ద్వారా ఎక్కువ కట్నం వసూలు చేయడానికి ప్రయత్నిస్తారు. దీని ఫలితంగా కొన్నిసార్లు మహిళలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. కొంతమంది డబ్బు డిమాండ్‌ చేయకపోయినా ఆమె పేరుతో ఉన్న అస్తి రాయించుకోవడానికి హింసిస్తున్నారు. ఇలాంటి ఆత్మహత్యలలో ఎక్కువగా ఉరి, విషప్రయోగం, స్వీయ దహనం ద్వారా జరుగుతాయి. నిప్పు పెట్టుకొని ఆత్మహత్యకు పాల్పడిన చాలా సందర్భాల్లో దాని ప్రమాదంగా చూపిపంచే ప్రయత్నం బాగా జరుగుతుంది. మన దగ్గర వరకట్నం చట్టవిరుద్ధం. అయితే వధువు కుటుంబం నిర్వహించే వివాహాలలో వరుడు, అతని బంధువులకు ఖరీదైన బహుమతులు ఇవ్వడం ఇప్పటికీ సాధారణ ఆచారంగానే ఉంది. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో డేటా ప్రకారం దేశవ్యాప్తంగా 2021 సంవత్సరంలో 6,589 వరకట్న మరణాలు నమోదయ్యాయి. 2020లో 3.85శాతం వరకు ఉంది. ఉత్తరప్రదేశ్‌, హర్యానా రాష్ట్రాలలో అత్యధిక వరకట్న మరణాలు నమోదయ్యాయి.
కులదురహంకార హత్యలు
కులదురహంకార హత్య అనేది కుటుంబానికి పరువు, అవమానాన్ని తెచ్చిపెట్టారనే ఉద్దేశంతో జరుగుతున్న హత్య. తమకంటే తక్కువ కులం వ్యక్తిని భాగస్వామిగా ఎంచుకుంటే ఇంటి పరువు పోయిందనే ఉద్దేశంతో తల్లిదండ్రులే బిడ్డలను హత్య చేస్తున్నారు. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో గ్రామ కుల సంఘాలు లేదా ఖాప్‌ పంచాయితీలు కులం లేదా గోత్రంపై వారి ఆజ్ఞలను పాటించని వ్యక్తులకు క్రమం తప్పకుండా మరణశిక్షలు విధిస్తాయి. భారతదేశంలో ఇలాంటి హత్యలు జరిగే ప్రముఖ ప్రాంతాలు ఉత్తరాది రాష్ట్రాలు. ముఖ్యంగా అవి హర్యానా, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, జార్ఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లలో ఎక్కువగా ఉన్నాయి.
బహిరంగంగా సమర్ధిస్తున్నారు
కులదురహంకార హత్యలు కొన్ని రాష్ట్రాల్లో గణనీయంగా పెరిగాయి. దాంతో ఇది జూన్‌ 2010లో సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. కులదురహంకార హత్యలకు వ్యతిరేకంగా నివారణ చర్యలు తీసుకోవాలని భారత కేంద్ర ప్రభుత్వం ఆరు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. ఈ హత్యలు చాలా హింసాత్మకంగా ఉంటాయి. ఉదాహరణకు జూన్‌ 2012లో ఒక తండ్రి తన 20 ఏళ్ల కుమార్తె తాను అంగీకరించని వ్యక్తితో డేటింగ్‌ చేస్తుందని విని కత్తితో ఆమె శిరచ్ఛేదం చేశాడు. ఈ హత్యలను స్థానిక గ్రామస్తులు, పొరుగు వారు కూడా బహిరంగంగా సమర్ధిస్తున్నారు. 2013 సెప్టెంబర్‌లో ప్రేమ వివాహం చేసుకున్న యువ జంట దారుణ హత్యకు గురైన సంఘటన మనకు తెలిసిందే.
మార్పు రావాలి
ఇవే కాకుండా ఇప్పటికీ బ్రూణహత్యలు జరుగుతూనే ఉన్నాయి. ప్రేమించలేదని యాసిడ్‌ దాడులు, గొంతుకోసి చంపడాలు కొనసాగుతూనే ఉన్నాయి. వీటన్నింటినీ రూపుమాపాలంటే చట్టాల్లో మార్పులు తీసుకురావాలి. అలాగే సమాజంలో నెలకొని ఉన్న పురుషాధిక్య సమాజాన్ని అంతం చేసేందుకు ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకోవాలి. దానికి తగిన విధంగా విద్యా విధానంలో కూడా మార్పులు రావాలి. అప్పుడే స్త్రీలపై జరుగుతున్న హింసను అంతం చేయగలం.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కొబ్బరాకుల కళాకృతులు
మార్పులకు కంగారుపడొద్దు
ఇట్ల చేద్దాం
వ్యక్తిగత లక్ష్యాలూ అవసరమే
మూసవిధానానికి స్వస్తి చెప్పండి
బరువు తగ్గాలంటే వీటిని కలిపి తినొద్దు
ఈ పద్ధతి పాటించండి
పిల్లలతో ఇలా మాట్లాడండి
పనులు పంచుకోండి
ఆరోగ్యానికి ప్రమాదం
సమానత్వం వైపు పయనం
గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి
ఇట్ల చేద్దాం
మీల్‌ మేకర్‌తో వంటలు
నిద్ర కరువైందా..?
గోరువెచ్చటి నీటితో...
ఆనందం కోసం...
అత్యంత చిన్నవయసులోనే...
బాధ్యత కలిగిన వ్యక్తులుగా...
బరువు తగ్గాలంటే ఏం తినాలి..?
సమాజాన్ని ప్రభావితం చేస్తున్నారు
సానుకూలంగా వ్యవహరించండి
ఇట్ల చేద్దాం
బంగారు తంజావూరు చిత్రకళ
ఇట్ల చేద్దాం
వారిని అర్థం చేసుకోవాలంటే..?
జీర్ణశక్తికి ఇవి తింటే మంచిది
ప్రేమతో ఏదైనా జయించవచ్చు
మీ ఎదుగుదలకు అడ్డం కావొద్దు
ఆవిరి పట్టండి
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.