Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • ఫోన్ చూడొద్దని కసురుకున్న తల్లి.. కూతురు ఆత్మ‌హత్య‌
  • ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
  • ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌ కప్‌..టీమిండియాకు తొలి ఓటమి
  • భారీ భూకంపాల్లో తల్లడిల్లుతున్న టర్కీ, సిరియా..
  • ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ పై తొలిసారి యుద్ధనౌక ల్యాండింగ్‌..
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
బరువు పెరుగుతున్నారా..? | మానవి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మానవి
  • ➲
  • స్టోరి

బరువు పెరుగుతున్నారా..?

Sat 26 Nov 04:26:50.17214 2022

చలికాలంలో జలుబు, దగ్గు, కీళ్లు పట్టేయడం, శ్వాసకోశ సంబంధిత సమస్యలు, చర్మం పొడిబారడం.. వంటి సమస్యలు చాలామందిలో ఎదురయ్యేవే! అయితే ఈ కాలంలో చాలామంది బరువు కూడా పెరుగుతారని చెబుతున్నాయి కొన్ని అధ్యయనాలు! ఇంతకీ ఈ కాలంలో బరువు పెరగడానికి కారణాలేంటి..? అది తెలుసుకుంటే మన శరీరంలో అనవసరంగా పేరుకుపోయే కొవ్వుల్ని కరిగించచ్చు. శీతాకాలంలో చల్లటి వాతావరణం కారణంగా ఉదయాన్నే లేచి వ్యాయామం చేయడానికి శరీరం సహకరించదు. తద్వారా ఫిట్‌నెస్‌ రొటీన్‌ అదుపు తప్పుతుంది. ఇదిలాగే కొనసాగితే మన శరీరంలోకి చేరిన క్యాలరీలు కొవ్వుగా రూపాంతరం చెందుతాయి. ఫలితంగా బరువు పెరుగుతాం. అయితే దీన్ని అధిగమించడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ముఖ్యమంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మీ భాగస్వామి లేదా ఫ్రెండ్‌ని ఫిట్‌నెస్‌ పార్ట్‌నర్‌గా ఎంచుకొని ఒకరికొకరు ప్రోత్సహించుకుంటూ వ్యాయామం చేయాల్సి ఉంటుంది. ఇదే కాదు.. ఈ కాలంలో బరువు పెరగడానికి ఇంకా చాలా కారణాలే ఉన్నాయంటున్నారు నిపుణులు.
ఎండ తగలకపోయినా: వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వెచ్చదనం కోసం ఎండలో నిల్చోవడం మనకు అలవాటే. ఎండలో వ్యాయామాలు చేసే వారూ లేకపోలేదు. అయితే ఈ కాలంలో కొన్ని రోజులు పొగ మంచు కారణంగా ఎండ రాకపోవచ్చు.. ఇలా చలికాలంలో శరీరానికి ఎండ తగలకపోవడం వల్ల సీజనల్‌ ఎఫెక్టివ్‌ డిజార్డర్‌ (ఎస్‌ఏడీ) సమస్య తలెత్తే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఇది ఒక రకమైన డిప్రెషన్‌ లాంటిదే! దీని కారణంగా ఆహారపు కోరికలు, మోతాదుకు మించి ఆహారం తీసుకోవడం.. వంటివి తలెత్తుతాయి. ఈ అలవాట్లు అంతిమంగా బరువు పెరిగేందుకు దోహదం చేస్తాయి. కాబట్టి ఉదయం ఎండ లేకపోతే మధ్యాహ్నం పూట కాసేపు వీలు కుదుర్చుకొని ఎండలో గడపడం మంచిదట. అయితే ఈ క్రమంలో సూర్యకిరణాల కారణంగా చర్మ సమస్యలు తలెత్తకుండా సన్‌స్క్రీన్‌ లోషన్‌ రాసుకోవడం మాత్రం మరవద్దు.
హార్మోన్ల అసమతుల్యత వల్ల: హార్మోన్లు సమతులంగా లేకపోయినా బరువు పెరగడం మనకు తెలిసిందే! అయితే వాతావరణంలో మార్పులు వచ్చిన కొద్దీ హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుందని చెబుతున్నారు నిపుణులు. ఇది బరువు తగ్గే ప్రక్రియను నెమ్మదించడంతో పాటు ఆహారపు కోరికలు పెంచుతుంది. తద్వారా క్రమంగా బరువు పెరుగుతాం. కాబట్టి హార్మోన్ల అసమతుల్యత ఉన్న వారు ఈ కాలంలో రెగ్యులర్‌ చెకప్స్‌ చేయించుకోవడం అవసరం. అలాగే ఇందుకోసం మందులు వాడే వారు కూడా డాక్టర్‌ సలహా మేరకు సీజన్‌ను బట్టి అవసరమైతే మందుల్లో మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది.
అర్ధరాత్రి ఆకలేస్తోందా..? శీతాకాలంలో పగటి సమయం కంటే రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో డిన్నర్‌ త్వరగా ముగించడం, రాత్రి ఎక్కువసేపు మెలకువతో ఉండడం, రాత్రుళ్లు తేలికపాటి ఆహారం తీసుకోవడం.. ఇలా కారణమేదైనా అర్ధరాత్రి ఆకలేస్తుంటుంది. అలాంటప్పుడు చాలామంది బిస్కట్స్‌, చిప్స్‌, పాప్‌కార్న్‌, కుకీస్‌, చాక్లెట్స్‌.. వంటివి లాగించేస్తుంటారు. ఈ అలవాటును ఇలాగే కొనసాగిస్తే బరువు పెరగడం ఖాయం. కాబట్టి వీటికి బదులుగా ఏదో ఒక పండు, పండ్ల రసం, నట్స్‌, డ్రైఫ్రూట్స్‌.. ఇలా ఆలోచిస్తే ఆరోగ్యకరమైన లేట్‌ నైట్‌ స్నాక్స్‌కు కొదవే లేదు.
ఇకపోతే డీహైడ్రేషన్‌ కూడా ఆహారపు కోరికల్ని పెంచుతుందట. కాబట్టి రోజుకు బరువును బట్టి రెండు-మూడు లీటర్ల నీళ్లు తాగడం తప్పనిసరి. అయితే చల్లగా తాగడానికి ఇబ్బంది పడితే గోరువెచ్చగా తీసుకోవడం మంచిది.
ఇక వీటితో పాటు మనం తీసుకునే ఆహారం కూడా బరువు తగ్గించడంలో సహకరిస్తుంది. ఈ క్రమంలో జామ-యాపిల్‌ వంటి సీజనల్‌ పండ్లు, క్యారట్‌-బీట్‌రూట్‌ వంటి దుంపలు, గుడ్లు-నట్స్‌-గింజలు వంటి ప్రొటీన్లు అధికంగా లభించే పదార్థాలు.. ఇలాంటివి ఆరోగ్యానికే కాదు.. చలికాలంలో బరువును అదుపులో ఉంచడానికీ దోహదం చేస్తాయంటున్నారు నిపుణులు.

 

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కొబ్బరాకుల కళాకృతులు
మార్పులకు కంగారుపడొద్దు
ఇట్ల చేద్దాం
వ్యక్తిగత లక్ష్యాలూ అవసరమే
మూసవిధానానికి స్వస్తి చెప్పండి
బరువు తగ్గాలంటే వీటిని కలిపి తినొద్దు
ఈ పద్ధతి పాటించండి
పిల్లలతో ఇలా మాట్లాడండి
పనులు పంచుకోండి
ఆరోగ్యానికి ప్రమాదం
సమానత్వం వైపు పయనం
గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి
ఇట్ల చేద్దాం
మీల్‌ మేకర్‌తో వంటలు
నిద్ర కరువైందా..?
గోరువెచ్చటి నీటితో...
ఆనందం కోసం...
అత్యంత చిన్నవయసులోనే...
బాధ్యత కలిగిన వ్యక్తులుగా...
బరువు తగ్గాలంటే ఏం తినాలి..?
సమాజాన్ని ప్రభావితం చేస్తున్నారు
సానుకూలంగా వ్యవహరించండి
ఇట్ల చేద్దాం
బంగారు తంజావూరు చిత్రకళ
ఇట్ల చేద్దాం
వారిని అర్థం చేసుకోవాలంటే..?
జీర్ణశక్తికి ఇవి తింటే మంచిది
ప్రేమతో ఏదైనా జయించవచ్చు
మీ ఎదుగుదలకు అడ్డం కావొద్దు
ఆవిరి పట్టండి
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.