చల్లటి వాతావరణం వల్ల దగ్గు, జలుబు.. వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. అయితే వీటి నుంచి విముక్తి పొందడానికి టీ తయారీలో అల్లం పొట్టును ఉపయోగిస్తుంటారు చాలామంది. దీంతో పాటు ఒకట్రెండు లవంగాలు, యాలకులు.. వేసి మరిగించిన టీ తాగితే దగ్గు, జలుబు నుంచి తక్షణ ఉపశమనం కలుగుతుంది. ఇలా ఇదొక్కటే కాదు.. ఈ పొట్టును మరో రకంగా కూడా తీసుకోవచ్చంటున్నారు నిపుణులు. అల్లం పొట్టును ఎండబెట్టి పొడి చేయాలి. టీస్పూన్ తేనెకు కొద్దిగా అల్లం పొడి కలుపుకొని తీసుకున్నా ఈ సమస్యల నుంచి సత్వర ఉపశమనం ఉంటుంది.