చెన్నై : ప్రముఖ నటుడు కమల్‌హాసన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో పాటు శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. దీంతో బుధవారం సాయంత్రం చెన్నైలోని శ్రీ రామచంద్ర మెడికల్ సెంటర్‌లో చేరారు. అత్యవసరమైనపరీక్షలు చేసినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. మరోరెండు రోజుల చికిత్స అనంతరం డిశ్చార్జి చేయనున్నట్లు వైద్యులు తెలిపారు. కొన్ని రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. బుధవారం ఉదయం ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్‌ను కలిసిన సంగతి తెలిసిందే.