Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • అయోధ్యలో రాముడి విగ్రహం కోసం నేపాల్ నుంచి శిలలు
  • కడపలో ఇద్దరు యువకులు దారుణహత్య
  • శ్రీకాకుళం తీరంలో విదేశీ డ్రోన్ కలకలం
  • ఫైర్‌సేఫ్టీ పాటించని గోదాముల నిర్వాహకులపై కఠిన చర్యలు: మంత్రి తలసాని
  • సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఇంట్లో భారీ చోరీ
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
ఎందుకంత తొందర? | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

ఎందుకంత తొందర?

Fri 25 Nov 06:12:22.987772 2022

- 24 గంటలు కూడా గడవకముందే నియామకం ఎలా చేశారు?
- సీఈసీ నియామకంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
- కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించిన రాజ్యాంగ ధర్మాసనం : తీర్పు రిజర్వ్‌
న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా ఐఏఎస్‌ మాజీ అధికారి అరుణ్‌ గోయల్‌ నియామకం మెరుపువేగంతో ఎందుకు నియమించాల్సి వచ్చిందని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. 24 గంటలు కూడా గడవకముందే మొత్తం నియామక ప్రక్రియ ఎలా పూర్తి చేశారంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల (ఈసీ) నియామకానికి ప్రస్తుత వ్యవస్థ సరికాదనీ, కొలీజియం వంటి వ్యవస్థను, స్వతంత్ర యంత్రాంగాన్ని ఏర్పాటుచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం కూడా విచారణ జరిపింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈసీ అరుణ్‌ గోయల్‌ నియామకానికి సంబంధించిన ఫైళ్లను జస్టిస్‌ కెఎం జోసెఫ్‌, జస్టిస్‌ అరు రస్తోగి, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ హృషికేశ్‌ రారు, జస్టిస్‌ సిటి రవి కుమార్‌లతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి అటార్నీ జనరల్‌ (ఏజీ) ఆర్‌. వెంకటరమణి సమర్పించారు.
నలుగురిలో చిన్నవాడిని ఎలా నియమించారు?
పిటిషనర్‌ తరపు సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌, గోపాల్‌ శంకర్‌నారాయణన్‌ వాదనలు వినిపిస్తూ అరుణ్‌ గోయల్‌ నియామకాన్ని ఒక్కరోజులోనే నోటిఫై చేశారని తెలిపారు. 'ఇదేం నియామకం? ఇక్కడ మేం అరుణ్‌ గోయల్‌ సామర్థ్యాన్ని ప్రశ్నించటం లేదు. వాస్తవానికి ఆయన అకడమిక్‌ పరంగా అద్భుతమైనవారు. కానీ నియామక ప్రక్రియ గురించి మేం ఆందోళన చెందుతున్నాం. గోయల్‌ ఫైల్‌ను ఎందుకంత హడావుడిగా, వేగంగా ఆమోదించాల్సి వచ్చింది. ఫైల్‌ మొదలుపెట్టిన రోజే అపాయింట్‌మెంట్‌ ఎలా జరిగింది. మేం ఈ పిటిషన్‌ను నవంబర్‌ 18న విచారించాం. అదే రోజు ఈసీ పదవి కోసం నలుగురి పేర్లను షార్ట్‌లిస్ట్‌ చేసిన ఫైల్‌ను ప్రధాన మంత్రి కార్యాలయానికి న్యాయశాఖ పంపించింది. అదే రోజున గోయల్‌ పేరును ప్రధాని సిఫార్సు చేశారు. ఎందుకు ఈ అత్యవసరం? గోయల్‌ ఎంపికలో ఎందుకంత ఉత్సాహం చూపారు? పార్లమెంట్‌ ఒక్కరోజులో బిల్లులు పాస్‌ చేయడంతో మనస్తాపం చెందాం. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్‌ కూడా అదే చేస్తోంది. నలుగురి పేర్లను సిఫార్సు చేస్తే వారిలో చిన్నవాడైన అరుణ్‌ గోయల్‌ పేరును ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు? ఆయనను మాత్రమే ఎలా నియమించారు? మిగతా వారిని ఏ ప్రాతిపదికన తిరస్కరించారు? దీనికి అనుసరించిన పద్ధతి ఏంటీ?' అని ధర్మాసనం ప్రశ్నించింది.
సూపర్‌ ఫాస్ట్‌గా నియామకం
మే 15 నుంచి కేంద్ర ఎన్నికల కమిషనర్‌ పోస్టు ఖాళీగా ఉందనీ, మే 15 నుంచి నవంబర్‌ 18 మధ్య ఏం జరిగిందో చెప్పాలని ఏజి ఆర్‌.వెంకటరమణిని జస్టిస్‌ అజరు రస్తోగి ప్రశ్నించారు. మొత్తం ప్రక్రియను అర్థం చేసుకోవడానికే ప్రశ్నిస్తున్నామనీ, అంతేతప్ప తాము కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకమని భావించకూడదని ధర్మాసనం పేర్కొంది. ఈ అపాయింట్‌మెంట్‌ ఒకే రోజు సూపర్‌ ఫాస్ట్‌ చేయడానికి ప్రభుత్వానికి ఏం అవసరమొచ్చింది? అని ప్రశ్నించింది. ''నియామకానికి అదే రోజు ప్రక్రియ, అదే రోజు క్లియరెన్స్‌, అదే రోజు నోటిఫైడ్‌, అదే రోజు అపాయింట్‌మెంట్‌ చేశారు. నియామక ఫైల్‌ 24 గంటల కూడా తిరగలేదు. మెరుపు వేగంతో వెళ్లింది' అని ధర్మాసనం పేర్కొంది.
నాలుగు పేర్లు షార్ట్‌లిస్ట్‌ చేయడానికి ప్రమాణాలేంటీ?
అయితే ఎన్నికల కమిషనర్లందరినీ త్వరితగతిన ప్రక్రియతో నియమిస్తారని ఏజీ ఆర్‌.వెంకటరమణి పేర్కొన్నారు. సాధారణంగా ఈ ప్రక్రియ మూడు రోజుల కంటే ఎక్కవ ఉండదని ఆయన వివరించారు. ఏజీగా తన సంప్రదింపుల వల్ల నియామకం కూడా వేగంగా జరిగిందని అన్నారు. ఎన్నికల కమిషనర్‌గా నియామకానికి ఆమోదం కోసం ప్రధాన మంత్రికి సిఫార్సు చేసిన కేంద్ర న్యాయశాఖ మంత్రి నలుగురి పేర్లను షార్ట్‌లిస్ట్‌ చేయడం వెనుక ఉన్న ప్రమాణాలేమిటని ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి ఏజీ స్పందిస్తూ షార్ట్‌లిస్ట్‌ చేయడానికి సీనియరిటీ, రిటైర్‌మెంట్‌, పదవీకాలం వంటి నిర్దిష్టమైన ప్రాతిపదికలు ఉన్నాయని తెలిపారు. కనుక నియమాకం అయిన వ్యక్తి కనీసం ఆరేండ్లు ఎన్నికల కమిషనర్‌గా ఉంటారని చెప్పారు. అయితే షార్ట్‌లిస్ట్‌ చేసిన నాలుగు పేర్లలో ఎన్నికల కమిషనర్‌గా ఆరేండ్లు కూడా ఉండని పేర్లను కూడా ప్రభుత్వం ఎందుకు ఎంపిక చేసిందని జస్టిస్‌ జోసెఫ్‌ ప్రశ్నించారు. ఇది సీఈసీ అండ్‌ ఈసీ (సర్వీస్‌ పరిస్థితులు) చట్టం-1991లోని సెక్షన్‌ 6ని ఉల్లంఘిస్తోందని అన్నారు. 'ఏజీ, మీరు ఇటీవలి నియమితులైన వ్యక్తితో ఒకే కేటగిరిలో ఇతర అధికారులు లేరని చెప్పారు. అయితే అదే కేడర్‌ నుండి అనేక మంది పేర్లు ఉన్నాయి. మేము జాబితాను చూశాం. ఈ పేర్లను ఎలా తీసుకున్నారో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం'అని ధర్మాసనం పేర్కొంది. దీనికి ఏజీ స్పందిస్తూ బ్యాచ్‌ ఒక కొలమానమనీ, పుట్టిన తేదీ ఒకటి, బ్యాచ్‌ నుంచి సీనియారిటీ మరొకటి అని పేర్కొన్నారు. డీఓపీటీ డేటాబేస్‌ నుంచే నలుగురి పేర్లను తీసుకున్నారని తెలిపారు.
ఒకనొక సమయంలో ఏజి ఆర్‌.వెంకటరమణి సహనం కోల్పోయి, నియామక ప్రక్రియకు సంబంధించిన మొత్తం అంశాన్ని పరిశీలించకుండా పరిశీలనలు చేయొద్దంటూ ధర్మాసనాన్ని పేర్కొన్నారు. ఏజీ వాదిస్తుండగా సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ జోక్యం చేసుకుని కోర్టుకు నివేదిక సమర్పించబోతుండగా, ఏజీ తీవ్రంగా స్పందించారు. దయచేసి మీరు కాసేపు నోరు మూయండి అంటూ ప్రశాంత్‌ భూషణ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కాసేపటికి జస్టిస్‌ అజరు రస్తోగి జోక్యం చేసుకొని, మీరు (ఏజీని ఉద్దేశించి) కోర్టు చెప్పింది జాగ్రత్తగా వినాలి. ప్రశ్నలకు సమాధానం మాత్రమే ఇవ్వాలి. మేమంతా సంఘటితంగా ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్తున్నాం. మీరు ఇష్టానుసారంగా వ్యవహరించడం కుదరదంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు.
తీర్పు రిజర్వ్‌
ఎన్నికల కమిషన్‌లో సంస్కరణలు, స్వయం ప్రతిపత్తి వంటి అంశాలపై దాఖలైన పిటిషన్లపై నాలుగు రోజుల పాటు సుదీర్ఘ విచారణ జరిపిన రాజ్యాంగ ధర్మాసనం, తీర్పును రిజర్వ్‌ చేసినట్టు తెలిపింది. ఈ కేసులో లిఖితపూర్వక వాదనలు దాఖలు చేసేందుకు వాద, ప్రతివాదులకు ఐదు రోజుల సమయం ఇచ్చింది. సీఈసీ, ఈసీలను పారదర్శకంగా నియమించడానికి స్వతంత్ర ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలా? వద్దా? అన్న దానిపై సుప్రీం కోర్టు త్వరలో తీర్పు ఇవ్వనుంది.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బడ్జెట్‌ రాజకీయ జుమ్లా
సమస్యలను పరిష్కరించడంలో బడ్జెట్‌ విఫలం
ఉపాధి హామీకి తూట్లు
త్రిపురలో సీపీఐ(ఎం) భారీ ర్యాలీలు
సాగుకు వెతలు
వికలాంగుల హక్కుల చట్టం అమలు
దేశ నిర్మాణానికి బలమైన పునాది
భవిష్యత్తు నిర్మాణానికి రోడ్‌ మ్యాప్‌ లేదు
ఇది ప్రజా వ్యతిరేక, కోతల బడ్జెట్‌ !
అన్నీ కోతలే..
తడబాటా..లేక !
కేంద్రబడ్జెట్‌ లో ప్రజలకు అన్యాయమే
తెలంగాణ పై కేంద్రం వివక్ష
ఎన్నికల వేళ కర్నాటకకు ప్రాధాన్యం
ఎస్‌సి, ఎస్‌టి సంక్షేమ పథకాల కేటాయింపుల్లోనూ తగ్గింపు
ఉద్యోగాలు పర్మినెంట్‌ చేయాల్సిందే
అవినీతే అతి పెద్ద శత్రువు : ద్రౌపది ముర్ము
ప్రజా సమస్యల ప్రస్తావన లేదు
నేడు కేంద్ర బడ్జెట్‌
అప్పుల భారతం
కొలువు సవాల్‌
ప్రగతి లేని పద్దులు
కార్మిక వ్యతిరేక విధానాలపై ఉధృత పోరు
నా యాత్ర ప్రజల కోసమే
బీబీసీ డాక్యుమెంటరీ నిషేధంపై పిటిషన్లు విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు
అదానీ జాతీయవాద దోపిడి
నేటి నుంచి సెంట్రల్‌ బడ్జెట్‌
ప్రజల జీవనోపాధులపై దాడులను నిరసిస్తూ ఫిబ్రవరిలో నిరసన కార్యాచరణ
ఒడిషా మంత్రి దారుణ హత్య
బీబీసీ డాక్యుమెంటరీ చూశారని...
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.