- ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు కూడా న్యూఢిల్లీ : తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రలకు సీబీఐ సమన్లు జారీ చేసింది. విచారణకు ఢిల్లీకి గురువారం రావాలని పేర్కొంది. సీబీఐ ఇటీవల అరెస్టు చేసిన సీబీఐ నకిలీ అధికారి శ్రీనివాస్ మంత్రి గంగులను కలవడం, ఏం మాట్లాడారు అనే అంశంపై అధికారులు విచారించనున్నారు.