Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • ఫోన్ చూడొద్దని కసురుకున్న తల్లి.. కూతురు ఆత్మ‌హత్య‌
  • ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
  • ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌ కప్‌..టీమిండియాకు తొలి ఓటమి
  • భారీ భూకంపాల్లో తల్లడిల్లుతున్న టర్కీ, సిరియా..
  • ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ పై తొలిసారి యుద్ధనౌక ల్యాండింగ్‌..
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
సుప్రీంలో మహిళా ధర్మాసనం | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

సుప్రీంలో మహిళా ధర్మాసనం

Fri 02 Dec 03:54:08.374153 2022

- సర్వోన్నత న్యాయస్థానం చరిత్రలో మూడోసారి
- అందులో ఒకసారి యాధృచ్చికమే
న్యూఢిల్లీ : దేశ సర్వోన్నత న్యాయస్థానంలో అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. సుప్రీం కోర్టు చరిత్రలో మూడోసారి మహిళా న్యాయమూర్తులతో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటైంది. జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ బేలా ఎం. త్రివేదితో కూడిన ధర్మాసనాన్ని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ ఏర్పాటు చేశారు. ఈ ధర్మాసనం గురువారం పలు కేసులను విచారించింది. పది వివాహ సంబంధిత వివాదాల పిటిషన్లు, మరో పది బెయిల్‌ పిటిషన్లను విచారించింది. 1950లో ఏర్పడ్డ సుప్రీం కోర్టులో మూడోసారి మహిళా న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఏర్పాటు అయింది. అయితే తొలిసారి 2013లో జస్టిస్‌ జ్ఞాన సుధా మిశ్ర, జస్టిస్‌ రంజనా ప్రసాద్‌ దేశారుతో కూడిన ధర్మాసనం కేసు విచారణలు చేపట్టింది. ఈ ధర్మాసనం ఏర్పాటు యాధృచ్చికంగానే జరిగింది. అప్పటి ప్రిసైడింగ్‌ న్యాయమూర్తి ఆఫ్తాబ్‌ ఆలమ్‌ గైర్హాజరుతో మహిళా ధర్మాసనం ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఆ తరువాత 2018లో జస్టిస్‌ ఆర్‌. భానుమతి, జస్టిస్‌ ఇందిరా బెనర్జీతో కూడిన మహిళా ధర్మాసనం ఏర్పాటు అయింది. ప్రస్తుతం సుప్రీం కోర్టులో 27 మంది న్యాయమూర్తులు ఉండగా, అందులో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. జస్టిస్‌ హిమాకోహ్లీ, జస్టిస్‌ బివి నాగరత్న, జస్టిస్‌ బేలా ఎం. త్రివేది 2021 ఆగస్టు 31న ఒకే రోజు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరిలో జస్టిస్‌ బివి నాగరత్న సుప్రీం కోర్టు తొలి మహిళ సీజేఐగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నది. 2027లో ఆమె 36 రోజుల పాటు సీజేఐగా బాధ్యలు నిర్వర్తించనున్నారు. సుప్రీం కోర్టు చరిత్రలో 11 మంది మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. 1989లో జస్టిస్‌ ఫాతిమా బీవి తొలి మహిళా న్యాయమూర్తిగా నియామకం అయ్యారు. ఆ తరువాత జస్టిస్‌ సుజాత మనోహర్‌ (1994), జస్టిస్‌ రుమాపాల్‌ (2000), జస్టిస్‌ జ్ఞాన్‌ సుధామిశ్రా (2010), జస్టిస్‌ రంజనా ప్రకాష్‌ దేశారు (2011), జస్టిస్‌ ఆర్‌. భానుమతి (2014), జస్టిస్‌ ఇందు మల్హోత్రా (2018), జస్టిస్‌ ఇందిరా బెనర్జీ (2018), జస్టిస్‌ హిమాకోహ్లీ (2022), జస్టిస్‌ బివి నాగరత్న(2022), జస్టిస్‌ బేలా ఎం.త్రివేది (2022)లు నియామకమయ్యారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బీజేపీని ఓడించండి.. త్రిపురను కాపాడండి
పౌర హక్కులను కాలరాయటమే
ఆర్టీఐ చట్టం నిర్వీర్యం
ఉత్తరాఖండ్‌ రిక్రూట్‌మెంట్‌ కేసు బీజేపీ నేత అరెస్టు
ఓటర్ల సంఖ్య 94.50 కోట్లు
అధికారంలో ఎవరున్నా బాధితుల పక్షాన పోరాడతాం
232 రుణ, బెట్టింగ్‌ యాప్‌ల నిషేధం
బాబా రాందేవ్‌పై కేసు
మంత్రి ఎవరి కోసం పనిచేస్తున్నారు
తలశిల రఘురామ్‌కు సతీవియోగం
విండ్‌పాల్‌ ఫ్రావిట్‌ ట్యాక్స్‌ను పెంచిన కేంద్రం
ఏపీ సచివాలయ ఉద్యోగుల సెలవుల రద్దు
సామూహిక లైంగికదాడి కేసులో అండమాన్‌ మాజీ ప్రధాన కార్యదర్శిపై చార్జిషీట్‌
ఏపీలో కానిస్టేబుల్‌ పరీక్షాఫలితాలు విడుదల
చట్టాన్ని దుర్వినియోగం చేయడాన్ని ఆపండి
కొండచరియలు విరిగిపడటంతో కూలిన వంతెన...
బాల్య వివాహాల కేసుల్లో అసోం సర్కార్‌ దూకుడు
9న బ్లాక్‌ డే
యూపీ పోలీసులు వేధించారు..
రక్షణ దిగుమతులు రూ.2లక్షల కోట్లు
పొట్ట చుట్టూ 51 సార్లు వాతలు..
నైకా నుంచి 'జెంటిల్‌మెన్స్‌ క్రూ' ఉత్పత్తులు
కేంద్రం అందరితో ఎందుకు పోరాడుతుంది?
కేరళ సమగ్రాభివృద్ధికి ప్రణాళిక
పడిపోయిన బీటెక్‌ ప్రవేశాలు
బీబీసీ డాక్యుమెంటరీ నిషేధంపై
ఏపీలో సీపీఎస్‌ ఆందోళనపై నిర్బంధం
మతమార్పిడి నిరోధక చట్టంపై ఐదు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు
అదానీకి ఎస్‌బీఐ రూ.27వేల కోట్ల అప్పు
అమెరికన్‌ డోజోన్స్‌ నుంచి అదానీ ఔట్‌..
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.