Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • జెఎల్ పేపర్ -2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలి : హైకోర్టు
  • సీరియల్ కిస్సర్ అరెస్ట్..
  • ఈడీ కార్యాలయం నుంచి బయటకొచ్చిన కవిత
  • వెంకయ్యనాయుడు ఇంట ఉగాది వేడుకలకు హాజరైన ఏపీ గవర్నర్
  • డబ్ల్యూపీఎల్ ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్లిన యూపీ వారియర్స్
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
అదానీపై ఆరోపణలు వాస్తవమే | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

అదానీపై ఆరోపణలు వాస్తవమే

Fri 27 Jan 02:02:33.007987 2023

- రిపోర్టులకు కట్టుబడి ఉన్నాం
- కేసు వేస్తే మేము రెడీ
- హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ వెల్లడి
న్యూఢిల్లీ : గౌతం అదానీకి చెందిన అదానీ గ్రూపు తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని.. ఎకౌంట్స్‌లోనూ మోసాలు చేస్తోందని తాము ఇచ్చిన రిపోర్టులకు కట్టుబడి ఉన్నామని అమెరికాకు చెందిన ప్రముఖ పెట్టుబడుల పరిశోధక సంస్థ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ స్పష్టం చేసింది. తమ సంస్థపై ద్వేషంతో ఆధారాలు లేకుండా హిండెన్‌బర్గ్‌ ఆరోపణలు చేసిందని అదానీ గ్రూపు స్టాక్‌ ఎక్సేంజీలు, రెగ్యూలేటరీ సంస్థలకు సమాచారం ఇచ్చింది. హిండెన్‌బర్గ్‌ రిపోర్టును తప్పుబట్టింది. దీనిపై హిండెన్‌బర్గ్‌ గురువారం ఘాటుగా స్పందించింది. తాము ఇచ్చిన రిపోర్టు సరైనదని.. లేకపోతే ఆ కంపెనీ చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. అదానీ గ్రూపు చేతనైతే తమపై కోర్టుకెళ్లాలని సవాలు విసిరింది. తమ సంస్థ అమెరికా నుంచి పనిచేస్తోందని.. కాబట్టి అక్కడ దావా వేసుకోవచ్చని సూచించింది. ఒకవేళ ఈ విషయంలో అదానీ గ్రూప్‌ కనుక విఫలమైతే తమ వాదనలు సరైనవిగా భావించాలని సవాల్‌ విసిరింది. అదానీ గ్రూపులో గతంలో పనిచేసిన సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు, వేలాది పత్రాలు, ప్రభుత్వ, అంతర్జాతీయ సంస్థల నిఘా నివేదికలు, అదానీ గ్రూపు కంపెనీల శాఖలు ఉన్న 12కు పైగా దేశాలను పర్యటించి ఈ నివేదికను తయారు చేసినట్టు హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ తెలిపింది. ''మా రిపోర్టును విడుదల చేసి 36 గంటలు దాటిన ఒక్క అంశాన్ని కూడా అదానీ గ్రూపు స్పష్టంగా లేవనెత్తలేకపోయింది. మేము సూటిగా 88 ప్రశ్నలు వేశాము. ఇందులో అదానీ గ్రూపు ఏ ఒక్క ప్రశ్నకు ఇప్పటికీ బదులు ఇవ్వలేకపోయింది. రెండు ఏళ్లుగా అనేక పరిశోధనలు చేసి 32,000 పదాలతో 106 పేజీల రిపోర్టును రూపొందించాము. ఇందులో ఏ తప్పు ఉన్న మాపై న్యాయ చర్యలు తీసుకోవచ్చు. అదానీ గ్రూపు మా రిపోర్టును తప్పుబడుతూ చర్యలు తీసుకుంటామని ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నాము. మేము ఇచ్చిన రిపోర్టుకు కట్టుబడి ఉన్నాము.'' అని హిండ్‌బర్గ్‌ రీసెర్చ్‌ ఓ ప్రకటనలో తెలిపింది. అదానీ గ్రూపు దావా వేస్తే తాము కూడా లీగల్‌గా ఆ కంపెనీ డాక్యూమెంట్లను కోరుతామని స్పష్టం చేసింది. హిండెన్‌బర్గ్‌ రిపోర్టులోని ప్రధానాంశాలు... ''అదానీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ, ఆయన కుటుంబ సభ్యులు గడిచిన కొన్ని దశాబ్దాలుగా ఆ కంపెనీ షేర్లను మానిఫ్యులేషన్‌ చేస్తుంది. ఎకౌంట్స్‌లో మోసాలకు పాల్పడుతుంది. షేర్ల ధరలను కృత్రిమంగా పెంచింది. పన్ను ఎగవేత, మనీలాండరింగ్‌ మోసాల కోసం అనేక అడ్డదారులు తొక్కింది. అప్పుల కోసం మోసాలకు పాల్పడింది. కార్పొరేట్‌ ప్రపంచ చరిత్రలో ఇదో అతిపెద్ద కుట్ర. గౌతమ్‌ అదానీ నికర సంపద విలువ ప్రస్తుతం 120 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.9.78 లక్షల కోట్లు)గా ఉంది. మూడేళ్ల క్రితం ఇది 20 బిలియన్‌ డాలర్లు (రూ.1.62 లక్షల కోట్లు)గా ఉండేది. గత మూడేళ్లలోనే తన గ్రూప్‌నకు చెందిన 7 ప్రధాన లిస్టెడ్‌ కంపెనీల ముఖ విలువను ఎక్కువ చేసి, షేర్ల విలువను కత్రిమంగా పెంచి ఆదానీ మోసానికి పాల్పడ్డారు. ఈ సమయంలో ఆయా కంపెనీల షేర్‌ విలువ సగటున 819 శాతం పెరిగింది. దీంతో మూడేళ్లలోనే అదానీ సంపద 100 బిలియన్‌ డాలర్లకు పైగా (రూ. 8.1 లక్షల కోట్లు) పెరిగింది. ఈ ఏడు కంపెనీలు 85 శాతం నష్టాలను నమోదు చేశాయి. ఇవి రెడ్‌జోన్‌లో ఉన్న కంపెనీలు. అయినప్పటికీ.. ఆర్థిక అవకతవకలతో ఆయన ఈ కంపెనీల నష్టాలను బయటపెట్టలేదు. నష్టాలతో ట్రేడ్‌ అవుతున్న ఆ కంపెనీల వాటాలను తనఖా పెట్టి అదానీ గ్రూప్‌ భారీగా రుణాలను పొందింది. దీంతో అదానీ కంపెనీ వాటాదార్ల సొమ్మును, గ్రూప్‌ ఆర్థిక పరిస్థితిని ప్రమాదంలో పడేసినట్టే. అదానీ గ్రూప్‌ మనీలాండరింగ్‌, అవినీతి ఆరోపణలకు గానూ భారీగా డబ్బు వెచ్చించింది. అదానీ సోదరుడు వినోద్‌ అదానీతో పాటు అదానీ కుటుంబ సభ్యులు మారిషస్‌లో 38 డొల్ల కంపెనీలతో పాటు సిప్రస్‌, యుఎఇ, సింగపూర్‌, పలు కరేబియన్‌ దీవుల్లో రెండంకెల సంఖ్యలో దొంగ కంపెనీలను ఏర్పాటు చేశారు. రూ.1.4 లక్షల కోట్ల అవినీతి, మనీలాండరింగ్‌, పన్ను ఎగవేతకు సంబంధించి అదానీ గ్రూప్‌ ఇప్పటికే నాలుగు కేసుల్లో ప్రభుత్వ సంస్థల విచారణను ఎదుర్కొంటుంది.'' అని ఈ రిపోర్టు తెలిపింది.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

దిగొచ్చిన యోగి...
రాహుల్‌ ఇంటికి పోలీసులు
ఎవరి జోక్యం కోరలేదు..
అమర్త్యసేన్‌కు విశ్వ భారతి మరోసారి నోటీసులు
అదానీ చర్యలన్నీ పారదర్శకమే : ఎన్‌ఎస్‌ఇ క్లీన్‌చిట్‌
పది డిమాండ్ల కోసం పోరాటం
మార్కెట్‌లో మాయగాళ్లు
అదానీపై విచారణలో జాప్యం ఎందుకు? : ఏచూరి
మళ్లీ పెరుగుతున్న కోవిడ్‌ కేసులు
ఉద్యోగాల పేరుతో మహిళలకు వల
ఈడీ ముందు హాజరుకాని ఎంపీ మాగుంట
మద్యం బాటిల్‌పై రూ.10 కౌ సెస్‌
నాలుగేళ్ల బాలుడిపై కోవిడ్‌ కేసు
మ‌హా విజ‌యం
తొమ్మిదేళ్లైనా పట్టించుకోరా?
తెలంగాణకు మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌
అప్రతిహతంగా కిసాన్‌ లాంగ్‌మార్చ్‌
అన్ని పరీక్షలూ రీషెడ్యూల్‌
ఎయిరిండియాలో రెండో దఫా వీఆర్‌ఎస్‌
దోషులపై కఠిన చర్యలు తీసుకోండి
రాష్ట్రపతికి పౌర సన్మానం
ఏపీ సర్కారుకు పట్టభద్రుల సెగ
సిజెఐపై ట్రోలింగ్‌ ఆపండి
గిరిజనులపై తూటా!
ప్రకటనలు ఘనం..పనులు శూన్యం
ఎమ్మెల్యేలకు ఎర కేసులో సీబీఐకి సుప్రీం నోటీసులు
పార్లమెంటులో ప్రతిపక్షాల సత్యాగ్రహం
ప్రతిపక్షాల భారీ మానవహారం
దేశ వ్యతిరేక ప్రసంగం చేయలేదు
ఉక్కు సంకల్పం..
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.