- సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి న్యూఢిల్లీ : రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే దేశభక్తికి ప్రతీక అని సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన సోషల్ మీడి యాలో ఒక వీడియోను విడుదల చేశారు. '' భారత రాజ్యాంగం అందరికీ సమన్యాయం కల్పిస్తున్నది. దీంతో పాటు సమైక్యత, సోదరభావాన్ని పెంపొం దిస్తున్నది. మనకు ఉన్న హక్కులు, బాధ్యతలు, మౌలిక అధికారాలను వినియోగించుకునేందుకు వీలుగా రాజ్యాంగం రూపకల్పన జరిగింది. అన్ని వర్గాలకూ న్యాయం దక్కేలా లిఖించారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లోనూ సమానంగా ఉండా లని స్పష్టంగా ప్రస్తావించింది. అయితే రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక సూత్రాలపై దాడులు జరుగు తున్నాయి. గత ఏడెనిమిదేండ్లుగా సంపన్నులు శతకోటీశ్వరుల వుతుంటే..పేదలు మరింత అట్టడుగుస్థాయికి దిగజారుతున్నారు. ఇది ఆర్థిక అంతరాల్లోనే కాకుండా సామాజిక అంశాల్లోనూ వారికి సమన్యాయం దక్కటంలేదు .అల్పసంఖ్యాకవర్గాలపై ప్రాణాలు తీసేలా హంతకదాడులు జరుగుతున్నాయి. దేశ సమానత, సమగ్రత అంటేనే సమన్యాయం. కానీ అలా ఎక్కడా జరగటంలేదు. దళితులు, ఆదివాసీలు, మహిళలపై అంతులేని అరాచకాలతో భయోత్పాతం కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని కాపాడుకోవటంతో పాటు.. మనకు రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైంది'' అని ఏచూరి పిలుపునిచ్చారు.