Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • క్రిమియాపై ఉక్రెయిన్‌ దాడి...
  • లోకేష్ యువగళం యాత్రకు బ్రేక్‌
  • ముగిసిన ఎమ్మె‌ల్సీ క‌విత ఈడీ విచార‌ణ‌
  • నాలుగో వికెట్ కోల్పోయిన‌ యూపీ...
  • పాయల్‌ రాజ్‌పుత్‌కు అస్వస్థత.. అయినా షూట్‌లో పాల్గొని
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
విత్త సంస్థలకు అదానీ గండం..! | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

విత్త సంస్థలకు అదానీ గండం..!

Sun 29 Jan 05:02:49.706145 2023

- బ్యాంక్‌లకు లక్షల కోట్ల అప్పు
- ఎంఎఫ్‌ల రూ.25వేల కోట్ల పెట్టుబడులు
- భారీగా ఇన్వెస్ట్‌ చేసిన ఎల్‌ఐసి
- ప్రమాదంలో ప్రజల సొమ్ము
న్యూఢిల్లీ : బ్యాంక్‌లు, బీమా సంస్థలు, మ్యూచువల్‌ ఫండ్లలో పొదుపు చేసుకున్న ప్రజల సొమ్ము ప్రమాదంలో పడింది. అదానీ గ్రూపు కంపెనీలకు అనేక విత్త సంస్థలు భారీగా అప్పులు, ఈక్విటీల రూపంలో సొమ్మును ఇచ్చి చేతులు కాల్చుకునే పరిస్థితులు నెలకొన్నాయి. ''అదానీ గ్రూపు ఎకౌంట్స్‌ మోసాలు, పన్ను ఎగవేత, మనీలాండరింగ్‌ మోసాల కోసం అనేక అడ్డదారులు తొక్కింది. అప్పుల కోసం మోసాలకు పాల్పడింది.'' అని ఇటీవల అమెరికన్‌ పరిశోధన సంస్థ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ 106 పేజీల రిపోర్టును విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నివేదిక దెబ్బకు భారత స్టాక్‌ మార్కెట్లలో రెండు సెషన్లలో అదానీ గ్రూపు కంపెనీల షేర్లు 25 శాతం మేర కుప్పకూలాయి. దీంతో ఎల్‌ఐసి సహా ఇతర బీమా, మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీలు వేల కోట్లు నష్టపోయాయి. ఇదే క్రమంలో బ్యాంక్‌లు ఇచ్చిన లక్షల కోట్ల అప్పులపై అనేక ఆందోళనలు నెలకొన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అదానీ కంపెనీల్లో పెట్టుబడుల వల్ల రెండు రోజుల్లో ఎల్‌ఐసి రూ.18వేల కోట్ల మేర నష్టాలు చవి చూడగా.. ఇలాంటి క్లిష్ట సమయంలోనూ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ తాజాగా జారీచేసిన రూ. 20,000 కోట్ల ఎఫ్‌పిఒ పరిమాణంలో ప్రభుత్వ ఒత్తిడితో ఐదు శాతం షేర్లకు ఎల్‌ఐసి బిడ్‌ వేసిందని సమాచారం. దీనికి ఎల్‌ఐసి రూ.300 కోట్లు కేటాయించనుందని సంకేతాలు వస్తున్నాయి. గత కొన్ని ఏళ్లుగా అదానీ గ్రూప్‌ కంపెనీల్లో ప్రభుత్వ రంగ బీమా సంస్థ భారీగా పెట్టుబడులను పెంచుకొంటూ పోయింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో 2021 జూన్‌ 30 నాటికి 1.32 శాతం వాటా ఉండగా, 2022 సెప్టెంబర్‌ 30 నాటికి 4.02 శాతానికి పెరిగింది. అదానీ టోటల్‌ గ్యాస్‌లో 2.11 శాతం నుంచి 5.77 శాతానికి పెంచుకుంది. అదానీ పోర్ట్స్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ పవర్‌, అంబూజా సిమెంట్‌, ఎసిసి తదితర అదానీ గ్రూపు కంపెనీల్లో ఎల్‌ఐసి రూ.80వేల కోట్ల పెట్టుబడులను కలిగి ఉంది. తాజా పరిణామాలతో అదానీ గ్రూపు కంపెనీల షేర్లు మరింత పడిపోతే ఎల్‌ఐసి పెట్టుబడులు కరిగి పోనున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
2022 డిసెంబర్‌ ముగింపు నాటికి దేశంలోని అన్ని మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీలు అదానీ కంపెనీల్లో స్థూలంగా రూ.25,263 కోట్ల పెట్టుబడులు పెట్టాయి. అదానీ గ్రూపులోని ఐదు కంపెనీలకు భారత బ్యాంక్‌లు రూ.81,200 కోట్ల అప్పులు ఇచ్చాయి. మిగితా ఐదు లిస్టెడ్‌, ఇతర అనుబంధ కంపెనీలకు ఇచ్చిన అప్పుల లెక్కలేదు.
2021-22 ముగింపునకు ముందు మూడేళ్లలో అదానీ అప్పులు రెట్టింపై రూ.1 లక్ష కోట్ల నుంచి రూ.2 లక్షల కోట్లకు చేరాయి. బ్యాంక్‌లు ఇచ్చిన అప్పుల్లో 25 శాతం పెరుగుదల ఉంది. అధికార బలంతోనే సులభంగా అప్పులు పొందిందనే అరోపణలు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం గడిచిన తొమ్మిది మాసాల్లో ఇంకా ఎన్ని వేల కోట్ల అప్పులు తీసుకుందనేది వెల్లడి కావాల్సి ఉంది. అదానీ గ్రూపు కంపెనీల మోసాలపై వస్తున్న ఆరోపణలు రుజువు అయితే.. భవిష్యత్తుల్లో అదానీ సామాజ్య్రం మునిగిపోతే భారత బ్యాంకింగ్‌ వ్యవస్థ తీవ్ర అగాథంలోకి పడిపోనుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సెబీ దృష్టి..
అదానీ గ్రూపునపై హిండెన్‌బర్గ్‌ విడుదల చేసిన రిపోర్టుపై సెబీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. దశాబ్దాలుగా అదానీ కంపెనీలు అకౌంటింగ్‌ మోసాలకు, షేర్ల ధరల పెరుగుదలలో అవకతవకల కు పాల్పడుతుందని హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన రిపోర్టుపై సెబీ నిశితంగా పరిశీలన చేస్తుందని రిపోర్టులు వస్తున్నాయి. గతేడాది అదానీ గ్రూపు చేసుకున్న ఒప్పందాలపై దృష్టి పెట్టిందని సమాచారం.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

10 గంటలు 15 ప్రశ్నలు
లక్ష్మణరేఖ దాటుతున్నదెవరు?
మోడీ షేమ్‌ షేమ్‌.. 'వుయ్‌ వాంట్‌ జేపీసీ'
10 గంటలు ఇంటరాగేషన్‌
సీల్డ్‌ కవర్లు వద్దు
కష్టజీవుల వ్యతిరేక విధానాలపై ప్రతిఘటన
ప్రధాని మోడీతో జపాన్‌ ప్రధాని భేటీ
'తెలంగాణ పిటిషన్‌పై మీ స్పందన ఏంటీ..?'
కేరళలో మొదటి ట్రాన్స్‌ జెండర్‌ లాయర్‌గా పద్మాలక్ష్మీ..
వేతనాల్లో అంతరం
రైతులను రక్షించండి...దేశాన్ని కాపాడండి
పాలక పక్షమా.. ప్రతి పక్షమా!
దిగొచ్చిన యోగి...
రాహుల్‌ ఇంటికి పోలీసులు
ఎవరి జోక్యం కోరలేదు..
అమర్త్యసేన్‌కు విశ్వ భారతి మరోసారి నోటీసులు
అదానీ చర్యలన్నీ పారదర్శకమే : ఎన్‌ఎస్‌ఇ క్లీన్‌చిట్‌
పది డిమాండ్ల కోసం పోరాటం
మార్కెట్‌లో మాయగాళ్లు
అదానీపై విచారణలో జాప్యం ఎందుకు? : ఏచూరి
మళ్లీ పెరుగుతున్న కోవిడ్‌ కేసులు
ఉద్యోగాల పేరుతో మహిళలకు వల
ఈడీ ముందు హాజరుకాని ఎంపీ మాగుంట
మద్యం బాటిల్‌పై రూ.10 కౌ సెస్‌
నాలుగేళ్ల బాలుడిపై కోవిడ్‌ కేసు
మ‌హా విజ‌యం
తొమ్మిదేళ్లైనా పట్టించుకోరా?
తెలంగాణకు మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌
అప్రతిహతంగా కిసాన్‌ లాంగ్‌మార్చ్‌
అన్ని పరీక్షలూ రీషెడ్యూల్‌
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.