- లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీ : నేడు (బుధవారం) పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తొలుత లోక్‌సభలో బడ్జెట్‌ను సమర్పిస్తారు. అనంతరం రాజ్యసభలో టేబుల్ చేస్తారు. పన్ను చెల్లింపుదారులు, సామాన్యులు తమకు అనుకూలంగా ఏం ఉంటుంది? తమపై భారాన్ని పెంచే వార్తలు ఏం రాబోతున్నాయి? అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చివరి పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే కావడంతో అందరికీ తాయిలాలు అందుతాయని చాలా మంది ఆశిస్తున్నారు.