న్యూఢిల్లీ : త్వరలో ఎన్నికలు జరగనున్న దక్షిణాది రాష్ట్రమైన కర్నాటకకు బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించారు. కర్నాటకలో కరువు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ఆర్థిక సహకారం అందించ నున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అప్పర్ భద్ర ప్రాజెక్టుకు రూ.5,300 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. 29.4 టీఎంసీల సామర్థ్యంతో 2.25 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు నీటిని సరఫరా చేసేందుకు అప్పర్‌భద్ర ప్రాజెక్టును కర్ణాటక చేపట్టింది. ఈ ఏడాది మే 24తో కర్ణాటక అసెంబ్లీ గడువు ముగియనుంది. ఆలోపే అంటే మార్చి-ఏప్రిల్‌లో అక్కడ శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి.