Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • గొడ్డలితో భార్య-కూతురిని నరికి చంపేశాడు..
  • తెలంగాణ టీమ్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా: చంద్రబాబు
  • టోల్ చార్జెస్ పెంపుపై నితిన్ గడ్కరీకి లేక రాసిన మంత్రి వేముల
  • ఏప్రిల్ 25 నుంచి సమ్మర్ హలీడేస్..
  • రద్దు చేసిన ఏఈఈ నియామక పరీక్షల తేదీలు ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
ఇది ప్రజా వ్యతిరేక, కోతల బడ్జెట్‌ ! | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

ఇది ప్రజా వ్యతిరేక, కోతల బడ్జెట్‌ !

Thu 02 Feb 03:37:44.651911 2023

- ఆర్థిక సంక్షోభాన్ని తీవ్రతరం చేస్తుంది
- సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో విమర్శ
న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం పార్లమెంట్‌కు సమర్పించిన కేంద్ర బడ్జెట్‌ కోతల బడ్జెట్‌, పూర్తిగా ప్రజా వ్యతిరేకమైనదని సీపీఐ(ఎం) విమర్శించింది. పార్టీ పొలిట్‌ బ్యూరో ఈ మేరకు బుధవారం నాడిక్కడ ఒక ప్రకటన విడుదల జేసింది. కరోనా మహమ్మారి తలెత్తడానికి ముందే భారతదేశ ఆర్థిక వ్యవస్థ మందగిం చింది, ఆ తర్వాత వరుసగా కరోనా వచ్చిన రెండేళ్లలో మరింత అధ్వాన స్థితికి దిగజారింది, కరోనా తర్వాత అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థ మాంద్యం దిశగా కదులుతున్నప్పుడు ఆ మహమ్మారి అనంతర పునరుద్ధర ణపై ప్రతికూల ప్రభావం పడింది. ఇటువంటి పరిస్థితు ల్లో 2023-24 సంవత్సరానికి ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌లో ఉపాధి కల్పన, దేశీయ డిమాండ్‌ను, ప్రజల కొనుగోలు శక్తి ని పెంచడం వంటి కీలకమైన అంశాలను పరిష్కరించాలి. కానీ, ఈ విషయంలో ఈ బడ్జెట్‌ విఫలమైంది. పైగా దీనికి విరుద్ధంగా సంపన్నులకు మరింతగా పన్ను రాయితీలిస్తూ, ద్రవ్యలోటు తగ్గించే పేరుతో ప్రభుత్వ వ్యయాన్ని కుదించింది. దేశంలో గత రెండేళ్లలో ఉత్పత్తి అయిన మొత్తం సంపదలో 40.5శాతం దాకా కేవలం ఒకే ఒక్క శాతంగా ఉన్న సంపన్నుల వద్ద పోగు పడిందని ఆక్స్‌ఫామ్‌ నివేదిక బయటపెట్టిన సమయంలో ఈ బడ్జెట్‌ వచ్చింది. అందువల్ల, ఇది సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసే బడ్జెట్‌ అని చెప్పాలి.
2022-23 సంవత్సరానికి సవరించిన అంచనాల కన్నా 2023-24 సంవత్సరానికి మొత్తం ప్రభుత్వ వ్యయం కేవలం 7శాతమే అధికం.. అదే సమయంలో నామ మాత్రపు (ద్రవ్యోల్బణంతో కూడిన) జీడీపీలో పెరుగుదల (10.5శాతంగా) వుంటుందని అంచనా వేయ బడింది. అందువల్ల, జిడిపి శాతంలో ప్రభుత్వ వ్యయం తగ్గుతుంది. వడ్డీ చెల్లింపుల ను కూడా మినహా యించినట్లైతే, అప్పుడు ఈ వ్యయం గతేడాది కన్నా కేవలం 5.4శాతమే ఎక్కువ. ఒక్కసారి అవ్యక్త ద్రవ్యోల్బణ రేటు 4శాతాన్ని, దాదాపు ఒక శాతంగా ఉన్న జనాభా పెరుగుదలను పరిగణనలోకి తీసు కుంటే, ప్రజా ప్రయోజనాలే కీలకమని చెప్పుకుంటున్న ఈ బడ్జెట్‌తో మెజారి టీ ప్రజల జీవనోపాధిపై దాడులు మరింతగా పెరగబోతున్నాయి. ఇది వరకెన్నడూ లేని రీతిలో, నిరుద్యోగం నింగినంటుతున్న ఈ సమయంలో, మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి బడ్జెట్‌లో కేటాయిం పులు 33శాతం తగ్గించారు.. ఆహార సబ్సిడీలో రూ.90వేల కోట్లు, ఎరువుల సబ్సిడీలో రూ.50వేల కోట్లు, పెట్రో లియం సబ్సిడీలో రూ.6,900కోట్లు కోత పెట్టారు. కరోనా మహమ్మారి ఇంత లా కల్లోలం సృష్టిస్తే, గతేడాది ఆరోగ్య రంగ కేటాయింపుల్లో రూ. 9225 కోట్లు, విద్యా రంగ బడ్జెట్‌లో రూ.4297కోట్లు ఖర్చు చేయకుండా మురగబెట్టారు. చాలీచాలని వేతనాల తో నానా అవస్థలు పడుతున్న ఐసీడీఎస్‌ స్కీమ్‌ కార్మికులకు ఎలాంటి పెంపుదల లేదు. మొత్తం వ్యయంలో మహిళలకు బడ్జెట్‌లో (జెండర్‌ బడ్జెట్‌) కేవలం 9శాతం మాత్రమే కేటాయిం చారు. జనాభాలో 16శాతం మంది ఎస్‌సిలు వుండగా, వారికి బడ్జెట్‌లో కేవలం 3.5శాతం,. 8.6శాతంగా ఉన్న ఎస్టీలకు కేవలం 2.7శాతం మా త్రమే కేటాయించారు. రైతుల ఆదా యాన్ని రెట్టింపు చేస్తామంటూ ఒక పక్క ప్రభుత్వం అర్భాటంగా చేసుకున్న ప్రచారంలోని డొల్లతనం ప్రధాని కిసాన్‌ నిధికి కేటాయింపులను రూ. 68వేల కోట్ల నుండి రూ.60వేల కోట్ల కు తగ్గించడంలో కనబడుతోంది. మూలధన వ్యయాల్లో గణనీ యమైన పెరుగుదల వుందని, ఇది ఉపాధి కల్పనకు దారి తీస్తుందని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు చూసేందుకు పైకి మెరుగ్గా కనిపి స్తున్నా లోపలంతా బూటకమేనని పొలిట్‌బ్యూరో విమర్శి ంచింది. మూల ధన వ్యయాన్ని గణనీ యంగా పెంచామని 2022-23 సంవత్సరానికి సవరించిన అంచనాల ను చూసినట్లైతే ప్రభుత్వ సంస్థల వనరులతో సహా మొత్తంగా మూల ధన వ్యయాలు కేవలం 9.6శాతమే పెరిగాయి. ఇది, నామమాత్రపు జిడిపి లో 15.4శాతం పెరుగుదల కన్నా బాగా తక్కువే. ఆదాయపుపన్ను మిన హాయింపు పరిమితిని రూ.5లక్షల నుండి రూ.7లక్షలకు పెంచడం వల్ల వేతన జీవులకు కొద్దిగా ఉపశమనం కలిగింది. అయితే, ద్రవ్యోల్బణం, సామాజిక రంగ వ్యయంలో కోతల వల్ల విద్య, వైద్య రంగాలతో సహా నిత్యావసర సేవలపై ప్రజలు మరింత గా ఖర్చు పెట్టాల్సి వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలకు వనరుల బదిలీలను కుదించడం ద్వారా ఈ బడ్జెట్‌, ఆర్థిక సమాఖ్య వాదంపై మరి న్ని దాడులను కొనసాగిస్తోంది. ఈ బదిలీలు, 2022-23లో 8.4శాతం ద్రవ్యోల్బణం రేటు వున్నప్పటికీ 2021 -22లో జరిగిన బదిలీలు ఒకేలా వున్నాయని 2022- 23 సంవత్సరానికి సవరించిన అంచనాలు వెల్లడిస్తున్నాయి.. రాష్ట్ర ప్రభుత్వాలు రుణాలను తీసుకునే అంశంపైనా మరిన్ని షరతు లు రుద్దింది. బడ్జెట్‌లో సంపన్నులకు ఇచ్చే పన్ను రాయితీలు, మొత్తంగా పన్ను ప్రతిపాదనలన్నిటితో 2023- 24లో రూ.35వేల కోట్ల మేర రెవిన్యూ నష్టం ఉంటుందని ఆర్థిక మంత్రి తెలియ చేశారు. ప్రజలకు ఎంతగానో అవసర మైన ఉపశమనాన్ని కలిగిం చేందుకు, ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దారి తీసేలా దేశీయ డిమాండ్‌ను పెంపొం దించేందుకు గానూ బడ్జెట్‌ ఈ క్రింది చర్యలు తీసుకోవాల్సి ఉంది.
1.ఉపాధి కల్పనా ప్రాజెక్టుల్లో ప్రభుత్వ పెట్టుబడులను గణనీయంగా పెంచాలి.
2.మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ కేటాయింపులను గణనీయంగా పెంచి, కార్మికులకు అధిక వేతనాలు ఇవ్వాలి.
3.5కిలోల ఉచిత ఆహార ధాన్యాలతో పాటూ 5 కిలోల సబ్సిడీ ఆహార ధాన్యాలను పునరుద్ధరించాలి.
4.సంపద, వారసత్వపు పన్నుల ను విధించాలి.
5,ఆహార పదార్ధాలు, మందుల తో సహా నిత్యావసరాలపై జిఎస్‌టిని ఉపసంహరించాలి.
ఈ బడ్జెట్‌లోని ప్రజా వ్యతిరేక ప్రతిపాదనలకు, కోతలకు వ్యతిరేకం గా, పైన పేర్కొన్న డిమాండ్ల అమలు ను కోరుతూ ఈ నెల 22 నుండి 28వరకు దేశవ్యాప్తంగా సిపిఎం నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తుందని పొలిట్‌బ్యూరో ప్రకటన పేర్కొంది. ప్రజల జీవనోపాధిని పరిరక్షించాలని కోరుకునే అన్ని తరగతుల ప్రజలూ ఈ నిరసనల్లో పాల్గొని, గొంతెత్తాలని కోరింది.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కర్నాటక అసెంబ్లీ నగారా
లక్షద్వీప్‌ ఎంపీ మహ్మద్‌ ఫైజల్‌పై అనర్హత వేటు ఉపసంహరణ
ప్రభుత్వాన్ని విమర్శిస్తే దేశద్రోహులు కాదు
ప్రజలపై మరో భారం
పోలవరానికి రూ.10 వేల కోట్లు ఇవ్వండి
విజయవంతంగా సారెక్స్‌-2023
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అనుమతించం
లోక్‌సభలో అటవీ సంరక్షణ సవరణ బిల్లు
రాహుల్‌ గాంధీ ఎందుకు క్షమాపణలు చెప్పాలి?
వివేకా హత్య కేసు విచారణకు కొత్త సిట్‌
పంటనష్టం చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలి
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 9,79,327 పోస్టులు ఖాళీ
రైల్వే కోచ్‌, పసుపు బోర్డు పెట్టే ప్రతిపాదన లేదు
చదువుకు దూరం
పీఎఫ్‌పై 5 పైసల వడ్డీ పెంపు
నోటీసులు మాకు..సమాచారం కేటీఆర్‌కు
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి
విద్వేష ప్రసంగాలపై చర్యలేవి?
బంగ్లా ఖాళీ చేస్తా
పార్లమెంట్‌లో కొనసాగిన ఆందోళన
సివిల్‌ సర్వీసులకు ఎస్టీలు 166 మందే..!
నకిలీ మందులు తయారు చేస్తున్న 18 ఫార్మా సంస్థల అనుమతులు రద్దు
హక్కుల ఉల్లంఘనేముంది?
విత్‌హెల్డ్‌లో బీబీసీ పంజాబ్‌ న్యూస్‌
2.38 లక్షలకు పైగా డొల్ల కంపెనీలు
ఈడీ లేఖకు ఎమ్మెల్సీ కవిత సమాధానం
రైతన్నల బలవన్మరణాలు
నాలుగేండ్లలో కనిష్టానికి ఉపాధి
అక్రమ మైనింగ్‌లో ఎఫ్‌ఐఆర్‌లు ఆరు శాతమే
అప్పు 155.8 లక్షల కోట్లు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.