- కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విలక్షణ రీతిలో స్పందించారు. ''ఉపాధి కల్పనలో విజన్ లేదు. అసమానతలను తగ్గించే ఉద్దేశం లేదు. ఒకశాతం మంది 40 శాతం సంపదను కలిగి ఉన్నారు. 50 శాతం మంది పేదలు 64శాతం జీఎస్టీని చెల్లిస్తున్నారు. ఇప్పటికీ 42 శాతం మంది యువత నిరుద్యోగులుగానే ఉన్నారు. ప్రధానికిది అవసరం లేదు'' అని ట్వీట్ చేశారు.