- బడ్జెట్‌పై ప్రధాని మోడీ న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టి బడ్జెట్‌పై ప్రధాని మోడీ స్పందించారు. ఇది అమృత కాలంలో ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్ అనీ, దేశ నిర్మాణానికి బలమైన పునాది వేస్తుందని అన్నారు. బడ్జెట్ ప్రసంగం అనంతరం ప్రధాని మాట్లాడారు. ఈ చారిత్రక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మాలా సీతారామన్, ఆమె బందానికి అభినందనలు తెలిపారు. ఈ బడ్జెట్ అణగారిన వర్గాలకు ప్రాధాన్యతనిస్తుందనీ, రైతులు, మధ్యతరగతి సహా అన్నివర్గాల కలలను సాకారం చేస్తుందన్నారు. మహిళా సాధికారత మరింత పెరిగేలా దోహదం చేస్తుందని తెలిపారు. మహిళా స్వయం సహాయక సంఘాలు వారిని మరింత మెరుగు పరుస్తాయని చెప్పారు. పన్నుల ధరలు తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించామన్నారు. పీఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ విశ్వకర్మల జీవితాల్లో భారీ మార్పులను తీసుకువస్తుందని విశ్వసించారు. విశ్వకర్మల మద్దతుకు సంబంధించిన పథకాలను తొలిసారిగా బడ్జెట్‌లో పొందుపరిచామని చెప్పారు.