Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • గొడ్డలితో భార్య-కూతురిని నరికి చంపేశాడు..
  • తెలంగాణ టీమ్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా: చంద్రబాబు
  • టోల్ చార్జెస్ పెంపుపై నితిన్ గడ్కరీకి లేక రాసిన మంత్రి వేముల
  • ఏప్రిల్ 25 నుంచి సమ్మర్ హలీడేస్..
  • రద్దు చేసిన ఏఈఈ నియామక పరీక్షల తేదీలు ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
ఏపీలో సీపీఎస్‌ ఆందోళనపై నిర్బంధం | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

ఏపీలో సీపీఎస్‌ ఆందోళనపై నిర్బంధం

Sat 04 Feb 03:38:15.654664 2023

- యూటీఎఫ్‌ 'సంకల్ప దీక్ష'ను అడ్డుకున్న ప్రభుత్వం
- వందలాది మంది అరెస్టు
- నిరసనగా పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ దీక్ష మద్దతు తెలిపిన సీపీఐ(ఏం), సీపీఐ
- 5న జిల్లా కేంద్రాల్లో దీక్షలు : యూటీఎఫ్‌ పిలుపు
అమరావతి: కాంట్రీబ్యూటరీ పెన్షన్‌ స్కీం(సీపీఎస్‌) రద్దు కోరుతూ ఉపాధ్యాయులు ఆందోళనపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం మరోమారు నిర్బంధాన్ని ప్రయోగించింది. యుటిఎఫ్‌ తలపెట్టిన సంకల్పదీక్షను అడుగడుగునా అడ్డుకున్న పోలీసులు వందలాది మంది ఉపాధ్యాయులను అరెస్ట్‌ చేశారు. కంకిపాడు, ఉయ్యూరు, గన్నవరం, వీరవల్లి, ఆతుకూరు, హనుమాన్‌ జంక్షన్‌ పోలీస్‌ స్టేషన్లు ఉపాధ్యాయులతో నిండిపోయాయి. ఈ నిర్బంధ కాండకు నిరసనగా పీడీఎఫ్‌ ఎంఎల్‌సీలు వి. బాలసుబ్రమణ్యం, కె.ఎస్‌ లక్ష్మణరావు, ఐ. వెంకటేశ్వరరావు, తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ పీడీఎఫ్‌ అభ్యర్థి మీగడ వెంకటేశ్వరరెడ్డి యూటీఎఫ్‌ కార్యాలయంలోనే దీక్ష ప్రారంభించారు. శుక్రవారం ఉదయం నుండి రాత్రి వరకు ఈ దీక్ష సాగింది. దీంతో యూటీఎఫ్‌ కార్యాలయం వద్ద కూడా పెద్ద సంఖ్యలో పోలీసులు మొహరించారు. ఎంఎల్‌సీల దీక్షకు సీపీఐ(ఎం), సీపీఐ ఏపీ శాఖలు మద్దతు ప్రకటించాయి. ఆ పార్టీల రాష్ట్ర కార్యదర్శులు వి. శ్రీనివాసరావు, కె. రామకృష్ణ యూటీఎఫ్‌ కార్యాలయానికి వెళ్లి సంఘీభావం తెలిపారు. ఏపీ ఎన్‌జీఓ సంఘం కూడా మద్దతు తెలిపింది. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 5న జిల్లా కేంద్రాల్లో సంకల్ప దీక్షలు నిర్వహించాలని యూటీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి కఎస్‌ఎస్‌ ప్రసాద్‌ పిలుపునిచ్చారు.
గురువారం నుండే అరెస్ట్‌లు
రహదారులపై సభలు, సమావేశాలు రద్దు చేస్తూ జారీ చేసిన జిఓనెం.1 అమలులో ఉన్న నేపథ్యంలో విజయవాడ నగరానికి దూరంగా కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలో చిన్న అవుటపల్లి పరిధిలోని సుందరయ్య విద్యానగరంలో ఒక ప్రైవేటు స్థలంలో యూటీఎఫ్‌ నిర్వహించ తలపెట్టిన సంకల్ప దీక్ష కార్యక్రమానికి కూడా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. పైగా ఈ కార్యక్రమానికి వచ్చే ఉపాధ్యాయులను గురువారం నుండే అరెస్ట్‌ చేయడం ప్రారంభించింది. పోలీసు ఆటంకాలను దాటుకుని గన్నవరం పరిసర ప్రాంతాలకు చేరుకున్న వారినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉభయ గోదావరి జిల్లాలూ, విశాఖ, శ్రీకాకుళం ప్రాంతాల వైపు నుంచి వస్తున్న వారిని టోల్‌గేట్‌ వద్ద, విజయవాడ, గుంటూరు, ఇతర ప్రాంతాల వైపు నుంచి వస్తున్న వారిని గన్నవరంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఉపాధ్యాయులను చుట్టుముట్టి బలవంతంగా ఈడ్చి పడేశారు. ప్రైవేట్‌ బస్సుల్లో హనుమాన్‌ జంక్షన్‌, ఉంగుటూరు, కంకిపాడు పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. పెద్దఅవుటపల్లి వద్ద దశల వారీగా వచ్చిన పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ, యూటీఎప్‌ ఏపీ గౌరవ అధ్యక్షులు కె శ్రీనివాసరావు, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్‌ వెంకటేశ్వర్లు, కెఎస్‌ఎస్‌ ప్రసాద్‌, కార్యదర్శులు ఎస్‌పి మనోహర్‌, సుందరయ్య, ఎ కృష్ణ, కోశాధికారి బి.గోపిమూర్తి తదితరులను అరెస్టు చేశారు. వారిని వ్యక్తిగతపూచీతో సాయంత్రం విడుదల చేశారు.
సీపీఐ(ఎం) ఏపీ ఖండన
సీపీఎస్‌ విధానాన్ని రద్దుచేయాలని, పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయ సంఘ నాయకులను అక్రమంగా అరెస్టు చేశారని సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. పెనమలూరు పోలీసు స్టేషన్‌లో అరెస్టయిన వారిని ఆ పార్టీ ఏపీ రాష్ట్రకార్యదర్శి వి శ్రీనివాసరావు, ఏపీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు కలిసి సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉపాధ్యాయ సంఘాలు, పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలతో చర్చలు జరపాలని డిమాండ్‌ చేశారు. సిపిఎం సీనియర్‌ నాయకులు పి మధు కంకిపాడు పోలీస్‌ స్టేషన్‌లో ఉపాధ్యాయులను పరామర్శించారు.
దీక్షకు దిగిన పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు
ఉపాధ్యాయుల అక్రమ అరెస్టులకు నిరసనగా పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు యుటిఎఫ్‌ రాష్ట్రకార్యాలయంలో సంకల్పదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా శాసనమండలి పీడీఎఫ్‌ ఫ్లోర్‌లీడర్‌ వి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల రాష్ట్రప్రభుత్వ వైఖరి దుర్మార్గంగా ఉందన్నారు. అధికార ంలోకి వచ్చిన వారంలోపు రద్దుచేస్తామని రాష్ట్రప్రభుత్వం హామీనిచ్చి ఆ ఊసేఎత్తడం లేదని విమర్శించారు. ప్రభుత్వం దమనకాండను కొనసాగించినంత కాలం పోరాటం సాగితీరుతుందన్నారు. డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌ కెఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం తీవ్రమైన అప్రజాస్వామిక వైఖరితో ఉందని విమర్శించారు. ఇలాంటి ధోరణి సరికాదన్నారు. సీపీఎస్‌, జీపీఎస్‌ వద్దని, పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు.. ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పాదయాత్రలో 'వారం రోజుల్లో సిపిఎస్‌ రద్దు చేస్తామ'న్న హామీ, కాంట్రాక్టు ఉద్యోగుల రద్దు, డిఎలు సకాలంలో చెల్లింపు మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఈ కార్యక్రమం లో యూటీఎఫ్‌ రాష్ట్రకార్యదర్శులు బి లక్ష్మిరాజా,కృష్ణసుందరరావు, వి మహేష్‌,ఎఎన్‌ కుసుమ కుమారి తదితరులు పాల్గొన్నారు.
హామీ నిలబెట్టుకోండి :
సీపీఐ(ఎం), సీపీఐ ఏపీ శాఖల డిమాండ్‌
పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు చేపట్టిన సంకల్పదీక్షకు సీపీఐ(ఎం), సీపీఐ ఏపీశాఖలతో పాటు, ఏపీ ఎన్జీవో సంఘం మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా సీపీఐ(ఎం)ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ సీపీఎస్‌ రద్దుతో రాష్ట్రప్రభుత్వానికి ఆర్ధికభారం ఉండదన్నారు. . సీపీఎస్‌పై ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. ఓపీఎస్‌ను పునరుద్ధరిస్తేనే జగన్‌ ప్రభుత్వం ఉంటుందన్నారు. . నూతన విద్యావిధానం(ఎన్‌ఈపీ) ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రాన్ని ఆదానీకి, విద్య రంగాన్ని బైజూస్‌కు, పాల పరిశ్రమను అమూల్‌ కంపెనీకి జగన్‌ అప్పగించారని పేర్కొన్నారు. సీపీఎస్‌ను రద్దు చేయకపోతే రాబోయే రోజుల్లో ఐక్య ఉద్యమాలు వస్తాయని, అప్పుడు తప్పకుండా రద్దు చేయాల్సిందేనని తెలిపారు. సంకల్ప దీక్ష భవిష్యత్‌లో సమరదీక్షగా మారేందుకు పునాది పడిందని,ప్రభుత్వం తన తీరును మార్చుకోకపోతే ఫలితం అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించారు. సీపీిఐ ఏపీ రాష్ట్రకార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం ఉపాధ్యాయులకు భయపడుతోందని అన్నారు. సచివాలయం, సీఎం క్యాంపు కార్యాలయానికి గన్నవరం దూరంగా ఉన్నా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదన్నారు. పాధ్యాయులు ప్రభుత్వానికి గుణపాఠాలు చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలిపారు. ఎపిఎన్జీవో సంఘం వెస్ట్‌కృష్ణా అధ్యక్షులు విద్యాసాగర్‌ దీక్షకు మద్దతు తెలిపి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం)ఏపీ రాష్ట్రకార్యదర్శి వర్ల సభ్యులు వై వెంకటేశ్వరరావు, ఏపీ సీపీఐ రాష్ట్రనాయకులు జల్లివిల్సన్‌, ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి కె సుబ్బరావమ్మ తదితరులు పాల్గొన్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కర్నాటక అసెంబ్లీ నగారా
లక్షద్వీప్‌ ఎంపీ మహ్మద్‌ ఫైజల్‌పై అనర్హత వేటు ఉపసంహరణ
ప్రభుత్వాన్ని విమర్శిస్తే దేశద్రోహులు కాదు
ప్రజలపై మరో భారం
పోలవరానికి రూ.10 వేల కోట్లు ఇవ్వండి
విజయవంతంగా సారెక్స్‌-2023
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అనుమతించం
లోక్‌సభలో అటవీ సంరక్షణ సవరణ బిల్లు
రాహుల్‌ గాంధీ ఎందుకు క్షమాపణలు చెప్పాలి?
వివేకా హత్య కేసు విచారణకు కొత్త సిట్‌
పంటనష్టం చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలి
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 9,79,327 పోస్టులు ఖాళీ
రైల్వే కోచ్‌, పసుపు బోర్డు పెట్టే ప్రతిపాదన లేదు
చదువుకు దూరం
పీఎఫ్‌పై 5 పైసల వడ్డీ పెంపు
నోటీసులు మాకు..సమాచారం కేటీఆర్‌కు
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి
విద్వేష ప్రసంగాలపై చర్యలేవి?
బంగ్లా ఖాళీ చేస్తా
పార్లమెంట్‌లో కొనసాగిన ఆందోళన
సివిల్‌ సర్వీసులకు ఎస్టీలు 166 మందే..!
నకిలీ మందులు తయారు చేస్తున్న 18 ఫార్మా సంస్థల అనుమతులు రద్దు
హక్కుల ఉల్లంఘనేముంది?
విత్‌హెల్డ్‌లో బీబీసీ పంజాబ్‌ న్యూస్‌
2.38 లక్షలకు పైగా డొల్ల కంపెనీలు
ఈడీ లేఖకు ఎమ్మెల్సీ కవిత సమాధానం
రైతన్నల బలవన్మరణాలు
నాలుగేండ్లలో కనిష్టానికి ఉపాధి
అక్రమ మైనింగ్‌లో ఎఫ్‌ఐఆర్‌లు ఆరు శాతమే
అప్పు 155.8 లక్షల కోట్లు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.