Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • గొడ్డలితో భార్య-కూతురిని నరికి చంపేశాడు..
  • తెలంగాణ టీమ్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా: చంద్రబాబు
  • టోల్ చార్జెస్ పెంపుపై నితిన్ గడ్కరీకి లేక రాసిన మంత్రి వేముల
  • ఏప్రిల్ 25 నుంచి సమ్మర్ హలీడేస్..
  • రద్దు చేసిన ఏఈఈ నియామక పరీక్షల తేదీలు ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
పౌర హక్కులను కాలరాయటమే | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి

పౌర హక్కులను కాలరాయటమే

Mon 06 Feb 05:22:52.6639 2023

- బీబీసీ డాక్యుమెంటరీపై నిషేధం దేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు చేటు : 500మందికిపైగా శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు
న్యూఢిల్లీ : బీబీసీ డాక్యుమెంటరీపై మోడీ సర్కార్‌ నిషేధం విధించటాన్ని భారత్‌కు చెందిన 500మందికిపైగా శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు తీవ్రంగా ఖండించారు. మోడీ సర్కార్‌ తీరు పౌర హక్కులను కాలరాస్తోందని, భారత సార్వభౌమత్వాన్ని, సమగ్రతను దెబ్బతీస్తోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. గుజరాత్‌ అల్లర్ల ఘటనకు ప్రధాన బాధ్యుడు ఆనాటి రాష్ట్ర సీఎంగా ఉన్న నరేంద్రమోడీ..అని బీబీసీ డాక్యుమెంటరీ విశ్లేషించింది. రెండు భాగాలుగా ఈ డాక్యుమెంటరీ రూపొందగా, వీటి ప్రసారాలు భారత్‌లో మోడీ సర్కార్‌ నిషేధించింది. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వ తీరును విమర్శిస్తూ శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు ఆదివారం ఒక బహిరంగ ప్రకటన విడుదల చేశారు. ఐఐఎస్‌కు చెందిన అరిత్రా ఛటర్జీ, బిట్స్‌ పిలానీకి చెందిన కింజాల్‌ బెనర్జీ, కేంబ్రిడ్జ్‌ వర్సిటీకి చెందిన రోణాక్‌ సోని..మొదలైనవారు ఉన్నారు. డాక్యుమెంటరీ ప్రసారాలను అడ్డుకోవటం భారత పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాయటంగా వారు పేర్కొన్నారు. సమాజం, ప్రభుత్వానికి చెందిన ముఖ్య సమాచారం అందుబాటులో లేకుండా, దానిపై చర్చించకుండా చేయటమే మోడీ సర్కార్‌ లక్ష్యమని విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు ఆరోపించారు. ప్రకటనలో వారు పేర్కొన్న వివరాలు విధంగా ఉన్నాయి. డాక్యుమెంటరీ ప్రదర్శనను అడ్డుకునేందుకు పలు విశ్వవిద్యాలయాల యాజమాన్యం తీసుకున్న నిర్ణయం కూడా సరైంది కాదు. ఇది విద్యా స్వేచ్ఛ సూత్రాలను ఉల్లంఘిస్తోంది. సామాజిక, రాజకీయ సమస్యలపై బహిరంగ చర్చలను వర్సిటీలు ప్రోత్సహించాలి.
ప్రజాస్వామ్య సమాజం సక్రమంగా పనిచేయడానికి ఇలాంటి చర్చలు చాలా కీలకం. యూనివర్సిటీలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నందున అభిప్రాయాల వ్యక్తీకరణను అడ్డుకోవటం ఆమోదయోగ్యం కాదు.
జవాబుదారీ ఎవరు?
            జవాబుదారీ ఎవరు వహిస్తారన్నది తేలకపోతే, దేశంలో మరిన్ని మత ఘర్షణలు చెలరేగే ప్రమాదముంది. మత ఘర్షణలు, మత విద్వేషాన్ని అడ్డుకోవాలంటే గుజరాత్‌ 2002 మారణకాండ బాధ్యులెవరన్నది తేలాలి. మత ఏకీకరణతో దేశాన్ని రెండుగా విభజించే శక్తుల్ని ఎదుర్కోవటం చాలా ముఖ్యం. మత ఘర్షణలకు జవాబుదారీ ఎవరు ? అని డాక్యుమెంటరీ ప్రశ్నిస్తోంది. ఈనేపథ్యంలో బీబీసీ డాక్యుమెంటరీ లేవనెత్తిన ప్రశ్నలు అత్యంత ముఖ్యమైనవి. డాక్యుమెంటరీపై నిషేధం విధించటం ద్వారా బాధితుల గొంతును కేంద్రం అణచివేసింది. గుజరాత్‌ అల్లర్లపై విశ్వసనీయ సమాచారం అందుబాటులో ఉంది, ఆనాటి భయంకర ఘటనలపై సామాజిక, హక్కుల కార్యకర్తలు కీలక పత్రాలు విడుదల చేశారు. వీటిని చదవాలని బీబీసీ డాక్యుమెంటరీ చూసిన వీక్షకుల్ని శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు కోరారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కర్నాటక అసెంబ్లీ నగారా
లక్షద్వీప్‌ ఎంపీ మహ్మద్‌ ఫైజల్‌పై అనర్హత వేటు ఉపసంహరణ
ప్రభుత్వాన్ని విమర్శిస్తే దేశద్రోహులు కాదు
ప్రజలపై మరో భారం
పోలవరానికి రూ.10 వేల కోట్లు ఇవ్వండి
విజయవంతంగా సారెక్స్‌-2023
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అనుమతించం
లోక్‌సభలో అటవీ సంరక్షణ సవరణ బిల్లు
రాహుల్‌ గాంధీ ఎందుకు క్షమాపణలు చెప్పాలి?
వివేకా హత్య కేసు విచారణకు కొత్త సిట్‌
పంటనష్టం చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలి
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 9,79,327 పోస్టులు ఖాళీ
రైల్వే కోచ్‌, పసుపు బోర్డు పెట్టే ప్రతిపాదన లేదు
చదువుకు దూరం
పీఎఫ్‌పై 5 పైసల వడ్డీ పెంపు
నోటీసులు మాకు..సమాచారం కేటీఆర్‌కు
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి
విద్వేష ప్రసంగాలపై చర్యలేవి?
బంగ్లా ఖాళీ చేస్తా
పార్లమెంట్‌లో కొనసాగిన ఆందోళన
సివిల్‌ సర్వీసులకు ఎస్టీలు 166 మందే..!
నకిలీ మందులు తయారు చేస్తున్న 18 ఫార్మా సంస్థల అనుమతులు రద్దు
హక్కుల ఉల్లంఘనేముంది?
విత్‌హెల్డ్‌లో బీబీసీ పంజాబ్‌ న్యూస్‌
2.38 లక్షలకు పైగా డొల్ల కంపెనీలు
ఈడీ లేఖకు ఎమ్మెల్సీ కవిత సమాధానం
రైతన్నల బలవన్మరణాలు
నాలుగేండ్లలో కనిష్టానికి ఉపాధి
అక్రమ మైనింగ్‌లో ఎఫ్‌ఐఆర్‌లు ఆరు శాతమే
అప్పు 155.8 లక్షల కోట్లు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.