సూపర్‌స్టార్ కృష్ణ పెద్దకర్మను ఆదివారం కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున కృష్ణ అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మహేష్ బాబు మాట్లాడుతూ, 'నాన్న గారు నాకు చాలా ఇచ్చారు. నాన్న గారు ఇచ్చిన దాంట్లో అన్నిటికంటే గొప్పది మీ అభిమానం. ఆయనకి ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఆయన ఎల్లప్పుడూ నా గుండెల్లో ఉంటారు. మీ గుండెల్లోనూ ఉంటారు. మన మధ్యే ఉంటారు. మీరందరూ ఇక్కడకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మీ అభిమానం, ఆశీస్సులు నాపై ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని అన్నారు.