స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో రూపుదిద్దుకున్న చిత్రం 'మసూద'. సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, బాంధవి శ్రీధర్ ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రంతో సాయికిరణ్‌ని దర్శకుడిగా పరిచయం చేశారు నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా. ఇటీవల విడుదలైన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా హీరో తిరువీర్ మీడియాతో మాట్లాడుతూ, 'ప్రతి ఒక్కరిలో భయాలు ఉంటాయి. నాకు చిన్నప్పటి నుంచీ చీకటి అంటే భయం. నేను నా జీవితంలోనూ గోపీలానే ఉంటాను. 'మల్లేశం, పలాస, జార్జిరెడ్డి' వల్ల నేను ఇండిస్టీ జనాలకు తెలిశాను. కానీ ఈ చిత్రంలోని గోపి పాత్ర వల్ల కామన్ ఆడియెన్స్ వరకు చేరాను. నన్ను గుర్తు పడుతున్నారు. ప్రస్తుతం 'పరేషాన్' సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. 'మోక్షపటం' అనే సినిమా, వైజయంతీ మూవీస్‌లో ఓ వెబ్ సిరీస్ ఉంది. 'పారాహుషార్' అనే మరో చిత్రం కూడా లైన్‌లో ఉంది. కథ నచ్చితేనే సినిమాలు చేస్తా, కౌంట్ కోసం అలాగే రెమ్యూనరేషన్ కోసం మాత్రం చేయను' అని చెప్పారు.