అంగరంగవైభవంగా హలో ! హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డులు - సౌత్
Wed 25 Jan 16:49:19.940873 2023
నవతెలంగాణ హైదరాబాద్: మొదటి ఎడిషన్ హలో ! హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డులు - సౌత్, ద్వారా పలు పరిశ్రమల వ్యాప్తంగా విశిష్ట వ్యక్తులను గుర్తించడంతో పాటుగా కళాకారులు, ప్రొఫెషనల్స్, సంస్ధలను సైతం అట్టహాసంగా జరిగిన భారీ వేడుకలో గౌరవించారు. ఆర్‌పీ–సంజీవ్ గోయెంకా గ్రూప్ కు చెందిన హలో! (HELLO!) మ్యాగజైన్ తమ మొట్టమొదటి సౌత్ ఎడిషన్‘ హలో ! హాల్ ఆఫ్ ఫేమ్ ’అవార్డుల విజేతలను వెల్లడించింది. వినోద, వ్యాపార, ఇతర పరిశ్రమల రంగాలకు చెందిన విశిష్ట వ్యక్తులను ఈ అవార్డుల ద్వారా గుర్తించి, గౌరవించారు. ప్రారంభించిన నాటి నుంచి కూడా హలో! హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డులు పరిశ్రమలో అత్యంత గౌరవనీయమైన అవార్డులలో ఒకటిగా వెలుగొందుతుండటంతో పాటుగా ప్రతిభను గుర్తిస్తున్నాయి. ఈ అవార్డుల వేడుకకు నగరంలోని విశిష్ట వ్యక్తులు హాజరయ్యారు. మొట్టమొదటి ‘హలో ! హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డులు– సౌత్’ కార్యక్రమం హైదరాబాద్‌లో మంగళవారం తాజ్‌కృష్ణా హోటల్‌లో జరిగింది. ‘ఏ నైట్ ఎట్ ద ఒపెరా’ నేపథ్యంతో అట్టహాసంగా జరిగిన ఈ అవార్డుల వేడుక ఫ్యాషనబల్, ఉన్నత, ఆధునిక పోకడలు కలిగిన వ్యక్తుల కలయికగా సాగింది. దక్షిణ భారతదేశవ్యాప్తంగా తారలు, సోషలైట్లు ఈ కార్యక్రమానికి హాజరుకావడంతో పాటుగా తమ ప్రతిష్టాత్మకమైన అవార్డులను వెంట తీసుకువెళ్లారు. అవార్డుల వేదికతో పాటుగా రెడ్ కార్పెట్ సైతం గ్లిట్జ్ , గ్లామర్, ఉత్సాహంతో నిండిపోయింది. అద్భుతమైన ప్రదర్శనల మధ్యలో విజేతలను వెల్లడించారు. ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా సోఫీ చౌదరి వ్యవహరించారు. ఈ సందర్భంగా హలో! ఎడోటిరయల్ ఛైర్‌పర్సన్ అవర్ణ జైన్ మాట్లాడుతూ ‘‘ అత్యంత ప్రతిష్టాత్మకమైన హలో! హాల్ ఆఫ్ ఫేమ్ –సౌత్ అవార్డులను హలో! నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. సౌత్ స్టార్‌డమ్, పవర్, అద్భుతమైన ప్రతిభకు సాక్షిగా నిలవడం సంతోషంగా ఉంది. ఓ బ్రాండ్‌గా హలో! ఎప్పుడూ కూడా సృజనాత్మక ప్రతిభకు మద్దతు అందించడాన్ని గౌరవంగా భావిస్తుంది. మరీ ముఖ్యంగా ఔత్సాహిక లేదా ఇప్పటికే గుర్తింపు పొందిన వ్యక్తులను ఫ్యాషన్ , సాహిత్యం, థియేటర్, సినీ, క్రీడలు, దాతృత్వరంగంలో గుర్తిస్తుంటాము. హలో ! హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డులు –సౌత్ అనేది గత కొద్ది సంవత్సరాలుగా మేము ఏర్పరుచుకున్న సుదీర్ఘ బంధానికి ప్రతీక’’ అని అన్నారు. హలో ! హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డులు –సౌత్ ద్వారా విభిన్న రంగాలలోని వ్యక్తులను గుర్తించడంతో పాటుగా దక్షిణ భారతదేశంలో ప్రతి విభాగానికీ తగిన ప్రాతినిధ్యం, వారందించిన తోడ్పాటుకు తగిన గౌరవం అందించాయి.
List of Winners –
Vijay Deverakonda - Breakthrough Superstar Of The Year Adivi Sesh - Breakthrough Performance Of The Year Hansika Motwani - Popular Choice Award Mrunal Thakur - Rising Star Of The Year Dulquer Salmaan - Most Stylish Star Of The Year Aditi Rao Hydari - Most Beautiful Face Of The Year Lakshmi Manchu - Versatile Actor Of The Year Anushree Reddy - Fashion Designer Of The Year Rajeev Reddy - Rising Entrepreneur Of The Year Mahima Datla - Businesswoman Of The Year Gitanjali Maini - Contribution Towards Building An Art Ecosystem Thota Vaikuntam - Artiste Of The Year PV Sindhu – Sports personality Of The Year Kulsum Shadab Wahab – Philanthropist Of The Year Vinita Chaitanya – Contribution To Interior Design Swapna Dutt – Filmmaker Of The Year Jaydev Galla - Business Leader Of The Year Dulquer Salmaan – HELLO! Hall Of Fame Bingo Trendsetter Award Dev Mohan – Promising Talent Of The Year Shalini Bhupal – Art Patron Of The Year T Rajeev Reddy – Rising Entrepreneur Of The Year