హీరో సందీప్ కిషన్ నటించిన పాన్ ఇండియా సినిమా ''మైఖేల్'. రంజిత్ జయకోడి దర్శకుడు. కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పి, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి. భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నారాయణ్ దాస్ కె నారంగ్ సమర్పకులు. ఈనెల 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన హీరో నాని మాట్లాడుతూ, 'మైఖేల్ టీజర్, ట్రైలర్, విజువల్స్, పెర్ఫార్మెన్స్‌లు చూస్తుంటే కొత్త ఒరవడి మొదలతుందనిపిస్తుంది. 'శివ' వచ్చినప్పుడు మిగతా సినిమాలతో కొత్తగా అనిపించింది. అలాంటి సినిమా మైఖేల్ అవ్వాలని కోరుకుంటున్నాను' అని తెలిపారు. 'నా బ్లడ్ మొత్తం పెట్టి ఈ సినిమా చేశానని చాలా మంది చెప్పారు. అయితే ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. ఇలానే ప్రేమ చూపిస్తూ వుంటే, ఇంకా అద్భుతంగా పని చేస్తాను' అని సందీప్‌కిషన్ అన్నారు. దర్శకుడు రంజిత్ జయకోడి మాట్లాడుతూ, 'ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరున కృతజ్ఞతలు' అని చెప్పారు.