- ప్రొ కబడ్డీ సీజన్-9 హైదరాబాద్ గచ్చిబౌలీ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న ప్రొ కబడ్డీ సీజన్-9 పోటీ తొలి మ్యాచ్‌లో యుపి యోథా జట్టు ఒక్క పాయింట్ తేడాతో బెంగాల్ వారియర్స్ విజయం సాధించింది. సోమవారం చివరి పాయింట్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోటీలో యుపి యోథా 33-32పాయింట్ల తేడాతో బెంగాల్‌పై గెలిచింది. యుపి తరఫున పర్దీప్ నర్వాల్(14) రైడ్స్‌లో ఒంటరి పోరాటం చేయగా.. గుర్జీత్(4), రోహిత్(4) ట్యాకిల్స్‌లో మెరిసారు. ఇక బెంగాల్ వారియర్స్ తరఫున మణిందర్(10) రైడ్‌లో రాణించగా.. శ్రీకాంత్ జాదవ్(6), దీపక్ నివాస్(5) ట్యాకిల్స్‌లో మెరిసారు. ఇక యుపి జట్టు 4సార్లు ప్రత్యర్ధి జట్టును ఆలౌట్ చేయగా.. బెంగాల్ 2సార్లు మాత్రమే ఆలౌట్ చేయగల్గింది. ఇక తెలుగు టైటాన్స్-జైపూర్ పింక్ ప్యాంథర్స్ జట్ల మధ్య జరుగుతున్న రెండో మ్యాచ్ తొలి అర్ధభాగం ముగిసే సమయానికి టైటాన్స్ 12-20పాయింట్లతో వెనుకబడి ఉంది.