క్రీడా అవార్డుల ప్రదానం : 2022 జాతీయ క్రీడా పురస్కారాలను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన వేడుకలో అందజేశారు. తెలుగు తేజాలు నిఖత్ జరీన్ (బాక్సింగ్), ఆకుల శ్రీజ (టేబుల్ టెన్నిస్) అర్జున అవార్డులను అందుకున్నారు. టేబుల్ టెన్నిస్ దిగ్గజం అచంట శరత్ కమల్ ప్రతిష్టాత్మక ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న పురస్కారం అందుకున్నాడు.