Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • ఫోన్ చూడొద్దని కసురుకున్న తల్లి.. కూతురు ఆత్మ‌హత్య‌
  • ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
  • ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌ కప్‌..టీమిండియాకు తొలి ఓటమి
  • భారీ భూకంపాల్లో తల్లడిల్లుతున్న టర్కీ, సిరియా..
  • ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ పై తొలిసారి యుద్ధనౌక ల్యాండింగ్‌..
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
దర్జాగా అర్జెంటీనా | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి

దర్జాగా అర్జెంటీనా

Fri 02 Dec 02:46:08.601775 2022

        ఆరంభ మ్యాచ్‌లోనే అనూహ్య షాక్‌తో ప్రపంచకప్‌ రేసును మొదలుపెట్టిన అర్జెంటీనా.. గ్రూప్‌ దశను అద్భుతంగా ముగించింది. సూపర్‌స్టార్‌ లియోనల్‌ మెస్సీ ముందుండి నడిపించగా అర్జెంటీనా ప్రీ క్వార్టర్‌ఫైనల్లో కాలుమోపింది. పోలాండ్‌పై 2-0తో గెలుపొందిన అర్జెంటీనా గ్రూప్‌-సిలో అగ్రస్థానంతో నాకౌట్‌కు చేరుకుంది. మెస్సీ జట్టు చేతిలో ఓడినా.. మెరుగైన గోల్‌ వ్యత్యాసంతో పోలాండ్‌ సైతం ప్రీ క్వార్టర్‌ఫైనల్లోకి చేరుకుంది. సౌదీ అరేబియా, మెక్సికో గ్రూప్‌ దశ నుంచే నిష్క్రమించాయి.
- 2022 ఫిఫా ప్రపంచకప్‌
- ప్రీ క్వార్టర్స్‌లో మెస్సీసేన అడుగు
- 2-0తో పోలాండ్‌పై ఘన విజయం
- గోల్‌ వ్యత్యాసంతో పోలాండ్‌ ముందంజ
నవతెలంగాణ-దోహా (ఖతార్‌)
           నాకౌట్‌కు చేరుకునే దశలో కీలక మ్యాచ్‌లో అర్జెంటీనా అదరగొట్టింది. స్టార్‌ స్ట్రయికర్‌ లియోనల్‌ మెస్సీ మరోసారి అర్జెంటీనా విజయానికి తారకమంత్రంగా నిలిచాడు. గ్రూప్‌-సిలో పొలాండ్‌తో మ్యాచ్‌లో అర్జెంటీనా 2-0తో ఘన విజయం సాధించింది. అలెక్సిస్‌ మాక్‌ అలిస్టర్‌, జులియన్‌ అల్వారాజ్‌లు అర్జెంటీనాకు గోల్స్‌ కొట్టారు. బలమైన అర్జెంటీనాతో సమరంలో తేలిపోయిన పోలెండ్‌.. భారీ తేడాతో పరాజయం పాలవకుండా గొప్ప నియంత్రణ చూపించింది. అర్జెంటీనాతో చేతిలో ఓడినా.. మెరుగైన గోల్‌ వ్యత్యాసంతో పోలాండ్‌ గ్రూప్‌ దశను దాటింది. పొలాండ్‌తో సమానంగా నాలుగు పాయింట్లు సాధించిన మెక్సికో.. గోల్‌ వ్యత్యాసం ప్రకారం నాకౌట్‌ దశకు అర్హత సాధించలేదు. ఇక ప్రీ క్వార్టర్‌ఫైనల్లో ఆస్ట్రేలియాతో అర్జెంటీనాతో అమీతుమీ తేల్చుకోనుండా, ఫ్రాన్స్‌తో పొలాండ్‌ పోటీపడనుంది.
అర్జెంటీనా అదరహో..! : తొలి మ్యాచ్‌లో సౌదీ అరేబియా చేతిలో భంగపడిన అర్జెంటీనా.. ఆ తర్వాత రెండు మ్యాచుల్లో సత్తా చాటింది. టైటిల్‌ ఫేవరేట్‌ స్థాయి ఏంటో ఆటతీరుతోనే చూపించింది. లియోనల్‌ మెస్సీ ఈ రెండు విజయాల్లో తారకమంత్రంగా పని చేశాడు. అర్జెంటీనా ఆరంభం నుంచీ గోల్‌ కోసం దూకుడుగా ఆడింది. ఏకంగా 23 సార్లు పోలాండ్‌ గోల్‌పోస్ట్‌పై దాడి చేసింది. లియోనల్‌ మెస్సీ గోల్‌ ప్రయత్నాలను పోలాండ్‌ గోల్‌ కీపర్‌ గొప్పగా నిలువరించాడు. తొలి అర్థ భాగంతో పాటు రెండో అర్థ భాగం ఆటలోనూ మెస్సీ గోల్‌ కిక్‌లను గోల్‌ కీపర్‌ అడ్డుకున్నాడు. అర్జెంటీనా దూకుడుగా ఆడినా ప్రథమార్థంలో గోల్‌ నమోదు కాలేదు. 0-0తో గోల్‌ లేకుండా ముగిసింది. ద్వితీయార్థం ఆరంభ క్షణాల్లోనే అర్జెంటీనా గోల్‌ ఖాతా తెరిచింది. డిఫెండర్‌ మోలినా నుంచి 46వ నిమిషంలో పాస్‌ అందుకున్న అలెక్సిస్‌ మాక్‌ అలిస్టర్‌ అద్భుత గోల్‌ కొట్టాడు. దీంతో అర్జెంటీనా 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 67వ నిమిషంలో అర్జెంటీనా మరో గోల్‌ కొట్టింది. ఎంజో ఫెర్నాండేజ్‌ నుంచి పాస్‌ అందుకున్న జులియన్‌ అల్వారాజ్‌ అర్జెంటీనాను 2-0తో ఎదురులేని స్థానంలో నిలిపాడు. ఆట ఆఖరు క్షణాల్లో సైతం అర్జెంటీనా గోల్‌ ప్రయత్నాలు ఆపలేదు. మరో గోల్‌ కోల్పోతే నాకౌట్‌ బెర్త్‌ చేజారే పరిస్థితుల్లో.. పోలాండ్‌ డిఫెన్స్‌ గొప్ప తెగువ చూపించింది. అర్జెంటీనా ఎటాకర్లు పొలాండ్‌ డిఫెన్స్‌ను ఛేదించినా మరిన్ని గోల్స్‌ నమోదు కాకుండా జాగ్రత్త వహించింది.
ఇక సూపర్‌స్టార్‌ లియోనల్‌ మెస్సీ పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలచలేకపోయాడు. తొలి అర్థభాగం ఆట 39వ నిమిషంలో పొలాండ్‌ గోల్‌పోస్ట్‌ ముందున్న మెస్సీని గోల్‌ కీపర్‌ చేతితో తాకాడు. దీంతో వీఏఆర్‌ సమీక్షతో రిఫరీ అర్జెంటీనాకు పెనాల్టీ కిక్‌ ప్రకటించాడు. మెక్సికోపై రైట్‌ కిక్‌తో పెనాల్టీతో గోల్‌ కొట్టిన మెస్సీ.. పొలాండ్‌పై లెఫ్ట్‌ కిక్‌తో గోల్‌ అవకాశం చేజార్చుకున్నాడు. 74 శాతం బంతిని నియంత్రణలో ఉంచుకున్న అర్జెంటీనా..92 శాతం పాస్‌ కచ్చితత్వంతో చెలరేగింది. పొలాండ్‌ ఎటువంటి గోల్‌ ప్రయత్నాలు చేయలేదనే చెప్పాలి. 99 శాతం డిఫెన్స్‌కే పరిమితమైన పొలాండ్‌.. నాలుగు సార్లు గోల్‌ కోసం ప్రయత్నించింది. కానీ వాటిలో ఒక్క కిక్‌ కూడా టార్గెట్‌ దిశగా దూసుకెళ్లలేదు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నాయకత్వ సవాల్‌
ముఖేశ్‌ మెమోరియల్‌ 'మల్లయుద్ధ'
విజేతలు గాయత్రి, చంద్రశేఖర్‌ జోడీ
జోష్‌ హాజెల్‌వుడ్‌ అవుట్‌
సందడి షురూ
రివర్స్‌ స్వింగ్‌
సెమీస్‌లో సౌరాష్ట్ర
దీపపై 21 నెలల నిషేధం
మీ విజయం యువతకు స్ఫూర్తిదాయకం
సెమీస్‌లో నంద్యాల జోడీ
కార్లు వచ్చేశాయ్‌
సాధన మొదలైంది
సాయిప్రణీత్‌ ఓటమి
హైదరాబాద్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీ షురూ
సెమీస్‌లో బెంగాల్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌
ప్రపంచ విజేతలకు జేజేలు
క్వార్టర్స్‌లో సాయిప్రణీత్‌
ధోని పాత్రకు సిద్ధమే
కంగారూ పడకుండా!
శివాలెత్తిన శుభ్‌మన్‌
క్రీడలకూ కంటితుడుపే..!
ఆంధ్ర 379 ఆలౌట్‌
సిరీస్‌ సవాల్‌
కుల్దీప్‌ కీలకం
పర్యవేక్షణ కమిటీలో బబిత ఫోగట్‌
9వ స్థానంలో సింధు
జ్వెరెవ్‌పై చర్యల్లేవ్‌
ఇదేం పిచ్‌?
మెల్‌బోర్న్‌ మొనగాడు
ఐదేండ్లలో రూ.12.5 కోట్లు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.