- నాలుగు స్వర్ణాలు కైవసం - కామన్‌వెల్త్ పవర్‌లిఫ్టింగ్ పోటీలు నవతెలంగాణ-శంషాబాద్ : 2022 కామన్‌వెల్త్ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్స్‌లో తెలంగాణ తేజం, శంషాబాద్‌కు చెందిన పవర్ లిఫ్టర్ వి. మల్లిక యాదవ్ పతకాల పంట పండించింది. మహిళల 84 కేజీల ఓపెన్ విభాగంలో పోటీపడిన మల్లిక యాదవ్ నాలుగు పసిడి పతకాలు సొంతం చేసుకుంది. బ్యాక్ స్క్వాట్‌లో 236 కేజీలు, బెంచ్ ప్రెస్‌లో 100 కేజీలు, డెడ్ లిఫ్ట్‌లో 215.5 కేజీల బరువులను మల్లిక యాదవ్ అలవోకగా ఎత్తిపడేసింది. ఓవరాల్‌గా 552.5 కేజీల బరువు ఎత్తి కామన్‌వెల్త్ చాంపియన్‌షిప్స్‌లో 'స్ట్రాంగ్ ఉమెన్' టైటిల్‌ను కైవసం చేసుకుంది. 2019 వరల్డ్ ఓపెన్ చాంపియన్‌షిప్స్‌లో సైతం పోటీపడిన మల్లిక యాదవ్ తొమ్మిదో ర్యాంక్ సాధించింది. రాజేంద్రనగర్ ఎమ్మెల్కే ప్రకాశ్ గౌడ్ ఆర్థి సహకారంతో ఆక్లాండ్‌లో జరుగుతున్న పోటీలకు వెళ్లిన మల్లిక యాదవ్ తెలంగాణ గర్వపడే ప్రదర్శన చేసిందని గబ్బర్ ఫిట్‌నెస్ జిమ్ రాఘవేందర్ గౌడ్ సహా కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.