- 2023 ఆసియా కప్‌పై పాక్ కరాచీ : 2023 ఆసియా కప్ వేడి అప్పుడే మొదలైంది. భద్రతా కారణాలు, ప్రభుత్వ అనుమతుల రీత్యా ఆసియా కప్ కోసం భారత జట్టు పాకిస్థాన్ పర్యటనకు వెళ్లదని బీసీసీఐ కార్యదర్శి జై షా గతంలో పేర్కొన్నారు. తటస్థ ఆతిథ్య వేదికపై టోర్నీ నిర్వహిస్తామని సైతం ఏసీసీ అధ్యక్షుడిగా తెలిపారు. షా వ్యాఖ్యల పట్ల పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్ రమీజ్ రాజా స్పందిస్తూనే ఉన్నారు. 'పాక్‌కు సవ్యంగా ఆతిథ్య హక్కులు లభించాయి. భారత్ రాదనే కారణంగా వేదికను మార్పు చేస్తే.. పాకిస్థానే ఆసియా కప్‌కు దూరంగా ఉంటుంది. పాక్‌లో క్రికెట్ ఆతిథ్యం ఇవ్వగలమని నిరూపించాం. ద్వైపాక్షిక క్రికెట్ సమస్యలు అర్థం చేసుకోగలను. కానీ ఆసియా కప్‌ను పాక్ నుంచి తరలిస్తే మాస్తే మేమే తప్పుకుంటామని' రమీజ్ రాజా అన్నాడు.