Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • ఫోన్ చూడొద్దని కసురుకున్న తల్లి.. కూతురు ఆత్మ‌హత్య‌
  • ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
  • ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌ కప్‌..టీమిండియాకు తొలి ఓటమి
  • భారీ భూకంపాల్లో తల్లడిల్లుతున్న టర్కీ, సిరియా..
  • ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ పై తొలిసారి యుద్ధనౌక ల్యాండింగ్‌..
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
ఇక బంగ్లాతో ఢీ | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి

ఇక బంగ్లాతో ఢీ

Sun 04 Dec 03:42:45.666995 2022

- భారత్‌, బంగ్లా తొలి వన్డే నేడు
- ఇరు జట్ల ప్రపంచకప్‌ సన్నద్ధత
- ఉదయం 11.30 నుంచి సోనీలో..

        బంగ్లాదేశ్‌ పర్యటన. మూడు మ్యాచుల వన్డే సిరీస్‌. ఐసీసీ వన్డే సూపర్‌ లీగ్‌లో భాగం కాదు. సహజంగానే సీనియర్‌ ఆటగాళ్లు విశ్రాంతి తీసుకుంటారు. కానీ ఈ పర్యటన కాస్త భిన్నం. పూర్తి స్థాయి భారత జట్టు బంగ్లాలో అడుగుపెట్టింది. అందుకు కారణం, 2023 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌. స్వదేశంలో వచ్చే ఏడాది జరుగనున్న మెగా ఈవెంట్‌ కోసం ఇక్కడి నుంచే టీమ్‌ ఇండియా సన్నద్ధత షురూ చేయనుంది. భారత్‌, బంగ్లాదేశ్‌ తొలి వన్డే పోరు నేడు.
నవతెలంగాణ-మీర్పూర్‌
          భారత్‌, బంగ్లాదేశ్‌ అనగానే.. క్రికెట్‌ను అమితంగా అభిమానించే దేశాలు. ఈ రెండు జట్లు తలపడితే ఇటీవల కాలంలో అభిమానుల భావోద్వేగాలు సైతం తారాస్థాయికి చేరుతున్నాయి. ఇటు భారత్‌, అటు బంగ్లాదేశ్‌లో క్రికెట్‌ స్థానాన్ని తాత్కాలికంగా సాకర్‌ భర్తీ చేసింది. ఇరు దేశాల్లో ఇప్పుడు చర్చంతా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌పైనే. బంగ్లాదేశ్‌లో భారత క్రికెటర్లకు సైతం బ్రెజిల్‌, అర్జెంటీనా జెండాలతో స్వాగతం పలుకటం సాకర్‌ ఫీవర్‌కు నిదర్శనం. అభిమానులు సాకర్‌ కిక్కులో మునిగిపోగా.. భారత్‌, బంగ్లాదేశ్‌లు రానున్న వన్డే వరల్డ్‌కప్‌ సన్నద్ధతకు శ్రీకారం చుట్టనున్నాయి. మూడు మ్యాచుల వన్డే సిరీస్‌ నేడు మీర్పూర్‌ తొలి వన్డేతో ఆరంభం కానుంది.
దూకుడు మంత్ర! : వైట్‌బాల్‌ క్రికెట్‌లో భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య ఎదురుదాడి. పవర్‌ప్లే నుంచీ దూకుడుగా ఆడటంలో భారత బ్యాటర్లు తడబాటుకు లోనవుతున్నారు. ఇటీవల న్యూజిలాండ్‌తో సిరీస్‌లోనూ ఈ సమస్య స్పష్టంగా కనిపించింది. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, కెఎల్‌ రాహుల్‌ రాకతో బ్యాటింగ్‌ లైనప్‌ పరిపూర్ణంగా ఉంది. ధావన్‌, శ్రేయస్‌లకు తోడు పంత్‌ సైతం ఉండటంతో దూకుడు మంత్ర పట్టాలెక్కేందుకు ఆస్కారం ఉంది. విరాట్‌ కోహ్లికి బంగ్లాలో గొప్ప రికార్డుంది. ఇక్కడ 80.83 సగటుతో కోహ్లి 970 పరుగులు చేశాడు. 1000 పరుగుల మైలురాయికి 30 పరుగుల దూరంలో ఉన్నాడు. బంగ్లాదేశ్‌లో ఈ ఘనత సాధించిన రెండో విదేశీ బ్యాటర్‌గా నిలిచేందుకు విరాట్‌ ఎదురుచూస్తున్నాడు. ఈ ఏడాది ఈ ఫార్మాట్‌లో 21.87 సగటుతో నిరాశపరిచిన కోహ్లి.. పొట్టి ఫార్మాట్‌లో ఫామ్‌ అందుకున్న సంగతి తెలిసిందే. విరాట్‌ మంచి ఫామ్‌లో ఉండటంతో మూడంకెల స్కోరు ఆశించటం సహజమే. బౌలింగ్‌ విభాగంలో నలుగురు ఆల్‌రౌండర్లు తుది జట్టులో నిలువనున్నారు. శార్దుల్‌ ఠాకూర్‌, దీపక్‌ చాహర్‌లకు తోడు అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌లు బంతితో మ్యాజిక్‌కు సిద్ధమవుతున్నారు. మహ్మద్‌ సిరాజ్‌ స్పెషలిస్ట్‌ పేసర్‌గా ఉండనున్నాడు.
నమ్మకంగా బంగ్లా! : భారత్‌తో సిరీస్‌కు బంగ్లాదేశ్‌ నమ్మకంగా సిద్ధమవుతోంది. ఇద్దరు కీలక ఆటగాళ్లు తమీమ్‌ ఇక్బాల్‌, టస్కిన్‌ అహ్మద్‌లు గాయాలతో దూరమయ్యారు. అయినా, లిటన్‌ దాస్‌, షకిబ్‌ అల్‌ హసన్‌, ముష్ఫీకర్‌ రహీం, మహ్మదుల్లా వంటి సీనియర్‌ ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. స్వదేశంలో 2016 తర్వాత వన్డే సిరీస్‌ చేజార్చుకోని బంగ్లాదేశ్‌.. భారత్‌పై సిరీస్‌ విజయమే లక్ష్యంగా ఆడనుంది. ఈ ఏడాది లిటన్‌ దాస్‌ భీకర ఫామ్‌లో ఉన్నాడు. అత్యధిక పరుగుల జాబితాలో బాబర్‌ ఆజాం తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు. సీనియర్లు అంచనాల మేరకు రాణిస్తే భారత్‌కు చెక్‌ పెట్టగలమనే విశ్వాసం బంగ్లాలో కనిపిస్తోంది. అనాముల్‌ హాక్‌, యాసిర్‌ అలీలు భారత్‌తో సిరీస్‌లో కీలక సవాల్‌ ఎదుర్కొనున్నారు. ముస్తాఫిజుర్‌ రెహమాన్‌ బౌలింగ్‌ దాడికి సారథ్యం వహించనున్నాడు. హసన్‌ మహమూద్‌, హోస్సేన్‌, అఫిఫ్‌ హోస్సేన్‌లు ముస్తాఫిజుర్‌తో కలిసి బౌలింగ్‌ బాధ్యతలు పంచుకోనున్నారు.
పిచ్‌, వాతావరణం : ది షేర్‌ బంగ్లా స్టేడియం చివరగా 2021 మేలో వన్డే మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చింది. ఇక్కడ తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్లు భారీ స్కోరు చేయటం సహజమైంది. స్పిన్‌కు సహకరించినా, మరీ టెస్టు మ్యాచ్‌ల తరహా అనుకూలత ఉండదు. ఈ సమయంలో మీర్పూర్‌ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎటువంటి వర్షం సూచనలు లేవు. టాస్‌ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకునే వీలుంది.
తుది జట్లు (అంచనా) :
భారత్‌ : రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, కెఎల్‌ రాహుల్‌, రిషబ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), వాషింగ్టన్‌ సుందర్‌, అక్షర్‌ పటేల్‌, శార్దుల్‌ ఠాకూర్‌, దీపక్‌ చాహర్‌, మహ్మద్‌ సిరాజ్‌.
బంగ్లాదేశ్‌ : లిటన్‌ దాస్‌ (కెప్టెన్‌), అనాముల్‌ హాక్‌, షకిబ్‌ అల్‌ హసన్‌, ముష్ఫీకర్‌ రహీం (వికెట్‌ కీపర్‌), మహ్మదుల్లా, అఫిఫ్‌ హోస్సేన్‌, యాసిర్‌ అలీ, మెహిది హసన్‌ మిరాజ్‌, హసన్‌ మహముద్‌, ముస్తాఫిజుర్‌ రెహమాన్‌, ఎబాడాట్‌ హోస్సేన్‌.
షమి స్థానంలో మాలిక్‌
          సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమి బంగ్లాతో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ప్రాక్టీస్‌ సెషన్లో గాయపడిన షమి ప్రస్తుతం ఎన్‌సీఏలో బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. డిసెంబర్‌ 14న తొలి టెస్టుకు సైతం షమి అనుమానంగా మారాడు. షమి స్థానంలో యువ స్పీడ్‌గన్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. కివీస్‌పై వన్డే అరంగేట్రంలో మాలిక్‌ ఆకట్టుకున్నాడు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నాయకత్వ సవాల్‌
ముఖేశ్‌ మెమోరియల్‌ 'మల్లయుద్ధ'
విజేతలు గాయత్రి, చంద్రశేఖర్‌ జోడీ
జోష్‌ హాజెల్‌వుడ్‌ అవుట్‌
సందడి షురూ
రివర్స్‌ స్వింగ్‌
సెమీస్‌లో సౌరాష్ట్ర
దీపపై 21 నెలల నిషేధం
మీ విజయం యువతకు స్ఫూర్తిదాయకం
సెమీస్‌లో నంద్యాల జోడీ
కార్లు వచ్చేశాయ్‌
సాధన మొదలైంది
సాయిప్రణీత్‌ ఓటమి
హైదరాబాద్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీ షురూ
సెమీస్‌లో బెంగాల్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌
ప్రపంచ విజేతలకు జేజేలు
క్వార్టర్స్‌లో సాయిప్రణీత్‌
ధోని పాత్రకు సిద్ధమే
కంగారూ పడకుండా!
శివాలెత్తిన శుభ్‌మన్‌
క్రీడలకూ కంటితుడుపే..!
ఆంధ్ర 379 ఆలౌట్‌
సిరీస్‌ సవాల్‌
కుల్దీప్‌ కీలకం
పర్యవేక్షణ కమిటీలో బబిత ఫోగట్‌
9వ స్థానంలో సింధు
జ్వెరెవ్‌పై చర్యల్లేవ్‌
ఇదేం పిచ్‌?
మెల్‌బోర్న్‌ మొనగాడు
ఐదేండ్లలో రూ.12.5 కోట్లు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.