Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • ఫోన్ చూడొద్దని కసురుకున్న తల్లి.. కూతురు ఆత్మ‌హత్య‌
  • ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
  • ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌ కప్‌..టీమిండియాకు తొలి ఓటమి
  • భారీ భూకంపాల్లో తల్లడిల్లుతున్న టర్కీ, సిరియా..
  • ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ పై తొలిసారి యుద్ధనౌక ల్యాండింగ్‌..
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
మిరాజ్‌ మిరాకిల్‌ | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి

మిరాజ్‌ మిరాకిల్‌

Mon 05 Dec 03:55:25.005483 2022

            మెహిది మిరాజ్‌ అద్భుతం చేశాడు. బంగ్లాదేశ్‌కు ఊహించని విజయాన్ని కట్టబెట్టాడు. చివరి వికెట్‌కు 51 పరుగులు అవసరమైన కఠిన పరిస్థితుల్లో మిరాజ్‌ (38 నాటౌట్‌), ముస్తాఫిజుర్‌ (10 నాటౌట్‌) అసమాన ఇన్నింగ్స్‌లు ఆడారు. బంగ్లాదేశ్‌కు వికెట్‌ తేడాతో విజయాన్ని అందించారు. స్వల్ప స్కోర్ల థ్రిల్లర్‌లో భారత్‌పై బంగ్లాదేశ్‌ గెలుపొందిన బంగ్లాదేశ్‌ వన్డే సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.
- ఛేదనలో అసమాన ప్రదర్శన
- ఉత్కంఠ మ్యాచ్‌లో బంగ్లా గెలుపు
- భారత బౌలర్ల శ్రమ వృథా
నవతెలంగాణ-మీర్పూర్‌
            బంగ్లాదేశ్‌ లక్ష్యం 187 పరుగులు. 136 పరుగులకే 9 వికెట్లు పతనం. చివరి వికెట్‌కు బంగ్లాదేశ్‌ 51 పరుగులు చేయాలి. భారత్‌ ఒక్క వికెట్‌ పడగొడితే చాలు. టీమ్‌ ఇండియా విజయం లాంఛనమే అనిపించింది. కానీ మెహిది హసన్‌ మిరాజ్‌ (38 నాటౌట్‌, 39 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అదరగొట్టాడు. ముస్తాఫిజుర్‌ రెహమాన్‌ (10 నాటౌట్‌, 11 బంతుల్లో 2 ఫోర్లు)తో కలిసి పదో వికెట్‌కు అజేయంగా 51 పరుగులు జోడించాడు. భారత్‌తో తొలి వన్డేలో బంగ్లాదేశ్‌ను వికెట్‌ తేడాతో విజయాన్ని అందించాడు. కెప్టెన్‌ లిటన్‌ దాస్‌ (41, 63 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), షకిబ్‌ అల్‌ హసన్‌ (29, 38 బంతుల్లో 3 ఫోర్లు) మెరిసినా.. భారత బౌలర్ల మెరుపులతో బంగ్లాదేశ్‌ వరుసగా వికెట్లు కోల్పోయింది. మిరాజ్‌, ముస్తాఫిజుర్‌లు అద్వితీయ ప్రదర్శనతో 46 ఓవర్లలోనే ఛేదన ముగించారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 41.2 ఓవర్లలోనే కుప్పకూలింది. కెఎల్‌ రాహుల్‌ (73, 70 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్థ సెంచరీతో భారత్‌ను ఆదుకున్నాడు. షకిబ్‌ (5/43), హోస్సేన్‌ (4/47) భారత్‌ పతనాన్ని శాసించారు. అసమాన ఇన్నింగ్స్‌ నమోదు చేసిన మెహిది హసన్‌ మిరాజ్‌ 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు అందుకున్నాడు. భారత్‌, బంగ్లాదేశ్‌ రెండో వన్డే బుధవారం మీర్పూర్‌లోనే జరుగనుంది.
అతనొక్కడే! : 187 పరుగులను బంగ్లా సులువుగా ఛేదించాల్సింది. కానీ భారత బౌలర్లు సమిష్టిగా పోరాడారు. భారత్‌ను తిరిగి రేసులోకి తీసుకొచ్చారు. ఇన్నింగ్స్‌ తొలి బంతికే చాహర్‌ వికెట్‌ తీయగా.. మిడిల్‌ ఓవర్లలో మహ్మద్‌ సిరాజ్‌ విజృంభించాడు. వాషింగ్టన్‌ సుందర్‌, కుల్దీప్‌ సేన్‌లు సైతం మెరవటంతో బంగ్లాదేశ్‌ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. కెప్టెన్‌ లిటన్‌ దాస్‌ (41), షకిబ్‌ అల్‌ హసన్‌ (29) ఉండగా బంగ్లాదేశ్‌ 74/2తో పటిష్ట స్థితిలో నిలిచింది. కానీ వరుస వికెట్లు బంగ్లాను ఒత్తిడిలో పడేశాయి. మహ్మదుల్లా (14), ముష్ఫీకర్‌ (18), అనాముల్‌ (14), అఫిఫ్‌ (6) సహా హోస్సేన్‌ (0), మహమూద్‌ (0) నిరాశపరిచారు. 136 పరుగులకే 9 వికెట్లు చేజార్చుకున్న బంగ్లాదేశ్‌ ఓటమి కోరల్లో చిక్కుకుంది. ముస్తాఫిజుర్‌తో కలిసి చివరి వికెట్‌కు 41 బంతుల్లోనే 51 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన మిరాజ్‌ (38 నాటౌట్‌) మీర్పూర్‌లో భారత్‌కు గట్టి పంచ్‌ ఇచ్చాడు. చివరి ఓవర్లలో యార్కర్లు సంధించని భారత్‌.. లెంగ్త్‌ బాల్స్‌తో మూల్యం చెల్లించింది. మిరాజ్‌ క్యాచులను రాహుల్‌, సుందర్‌ వదిలేయటం సైతం బంగ్లాకు కలిసొచ్చింది.
బ్యాటర్లు విఫలం : తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 41.2 ఓవర్లలో 186 పరుగులకు కుప్పకూలింది. ప్రధాన బ్యాటర్లు పూర్తిగా తేలిపోయారు. కెప్టెన్‌ రోహిత్‌ (27), శిఖర్‌ ధావన్‌ (7) ఆశించిన ఆరంభం అందించలేదు. కోహ్లి (9) నిరాశపరిచాడు. శ్రేయస్‌ అయ్యర్‌ (24), వాషింగ్టన్‌ సుందర్‌ (19) తోడుగా కెఎల్‌ రాహుల్‌ (73) మంచి భాగస్వామ్యాలు నిర్మించాడు. 152/4తో మెరుగైన స్థితిలో నిలిచిన భారత్‌.. వరుసగా వికెట్లు కోల్పోయింది. బ్యాట్‌తో మెరువగల టెయిలెండర్లు ఉన్నప్పటికీ 50 ఓవర్ల పాటు ఆడలేకపోయింది. షాబాజ్‌ (0), శార్దుల్‌ (2), చాహర్‌ (0), సిరాజ్‌ (9) చేతులెత్తేశారు. చివరి ఆరు వికెట్లను 34 పరుగులకే చేజార్చుకుంది. షకిబ్‌ ఐదు వికెట్ల మాయజాలం ప్రదర్శించాడు.
స్కోరు వివరాలు :
భారత్‌ ఇన్నింగ్స్‌ : రోహిత్‌ (బి) షకిబ్‌ 27, ధావన్‌ (బి) మిరాజ్‌ 7, కోహ్లి (సి) దాస్‌ (బి) షకిబ్‌ 9, శ్రేయస్‌ (సి) ముస్తాఫిజుర్‌ (బి) హోస్సేన్‌ 24, రాహుల్‌ (సి) అనాముల్‌ (బి) హోస్సేన్‌ 73, వాషింగ్టన్‌ (సి) హోస్సేన్‌ (బి) షకిబ్‌ 19, షాబాజ్‌ (సి) షకిబ్‌ (బి) హోస్సేన్‌ 0, శార్దుల్‌ (బి) షకిబ్‌ 2, దీపక్‌ (ఎల్బీ) షకిబ్‌ 0, సిరాజ్‌ (సి) మహ్మదుల్లా (బి) హోస్సేన్‌ 9, కుల్దీప్‌ నాటౌట్‌ 2, ఎక్స్‌ట్రాలు : 14, మొత్తం : (41.2 ఓవర్లలో ఆలౌట్‌) 186.
వికెట్ల పతనం : 1-23, 2-48, 3-49, 4-92, 5-152, 6-153, 7-156, 8-156, 9-178, 10-186.
బౌలింగ్‌ : ముస్తాఫిజుర్‌ 7-1-19-0, మహమూద్‌ 7-1-40-0, మెహిది మిరాజ్‌ 9-1-43-1, షకిబ్‌ 10-2-36-5, హోస్సేన్‌ 8.2-0-47-4.
బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌ : నజ్ముల్‌ (సి) రోహిత్‌ (బి) దీపక్‌ 0, దాస్‌ (సి) రాహుల్‌ (బి) సుందర్‌ 41, అనాముల్‌ (సి) సుందర్‌ (బి) సిరాజ్‌ 14, షకిబ్‌ (సి) కోహ్లి (బి) సుందర్‌ 29, ముష్పీకర్‌ (బి) సిరాజ్‌ 18, మహ్మదుల్లా (ఎల్బీ) శార్దుల్‌ 14, అఫిఫ్‌ (సి) సిరాజ్‌ (బి) కుల్దీప్‌ 6, మెహిది మిరాజ్‌ నాటౌట్‌ 38, హోస్సేన్‌ (హిట్‌వికెట్‌) కుల్దీప్‌ 0, మహమూద్‌ (ఎల్బీ) సిరాజ్‌ 0, ముస్తాఫిజుర్‌ నాటౌట్‌ 10, ఎక్స్‌ట్రాలు : 17, మొత్తం : (46 ఓవర్లలో 9 వికెట్లకు) 187.
వికెట్ల పతనం : 1-0, 2-26, 3-74, 4-95, 5-128, 6-128, 7-134, 8-135, 9-136.
బౌలింగ్‌ : దీపక్‌ 8-1-32-1, సిరాజ్‌ 10-1-32-3, కుల్దీప్‌ 5-0-37-2, షాబాజ్‌ 9-0-39-0, సుందర్‌ 5-0-17-2, శార్దుల్‌ 9-1-21-1.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నాయకత్వ సవాల్‌
ముఖేశ్‌ మెమోరియల్‌ 'మల్లయుద్ధ'
విజేతలు గాయత్రి, చంద్రశేఖర్‌ జోడీ
జోష్‌ హాజెల్‌వుడ్‌ అవుట్‌
సందడి షురూ
రివర్స్‌ స్వింగ్‌
సెమీస్‌లో సౌరాష్ట్ర
దీపపై 21 నెలల నిషేధం
మీ విజయం యువతకు స్ఫూర్తిదాయకం
సెమీస్‌లో నంద్యాల జోడీ
కార్లు వచ్చేశాయ్‌
సాధన మొదలైంది
సాయిప్రణీత్‌ ఓటమి
హైదరాబాద్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీ షురూ
సెమీస్‌లో బెంగాల్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌
ప్రపంచ విజేతలకు జేజేలు
క్వార్టర్స్‌లో సాయిప్రణీత్‌
ధోని పాత్రకు సిద్ధమే
కంగారూ పడకుండా!
శివాలెత్తిన శుభ్‌మన్‌
క్రీడలకూ కంటితుడుపే..!
ఆంధ్ర 379 ఆలౌట్‌
సిరీస్‌ సవాల్‌
కుల్దీప్‌ కీలకం
పర్యవేక్షణ కమిటీలో బబిత ఫోగట్‌
9వ స్థానంలో సింధు
జ్వెరెవ్‌పై చర్యల్లేవ్‌
ఇదేం పిచ్‌?
మెల్‌బోర్న్‌ మొనగాడు
ఐదేండ్లలో రూ.12.5 కోట్లు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.