- గృహ హింస ఆరోపణలపై ఏటీపీ లండన్ : జర్మన్ స్టార్ ఆటగాడు, మాజీ వరల్డ్ నం.2 అలెగ్జాండర్ జ్వెరెవ్‌పై గృహ హింస ఆరోపణలకు సరైన ఆధారాలు లేవని, అతడిపై ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోవటం లేదని ఏటీపీ (అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్) మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. జ్వెరెవ్ మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేసినట్టు అతడి మాజీ ప్రియురాలు ఒల్గా షరిపోవా ఓ మ్యాగజెన్‌కు ఇచ్చిన ఇంటర్య్యూలో ఆరోపించింది. అక్టోబర్ 2021లో ఒల్గా షరిపోవా ఆరోపణలపై ఏటీపీ స్వతంత్ర దర్యాప్తు సంస్థచే విచారణ జరిపింది. షరిపోవా, జ్వెరెవ్ సహా 24 మంది సన్నిహితులను దర్యాప్తు సంస్థ విచారించింది. ప్రధా నంగా ఏటీపీ టోర్నీ వేదికలు షాంఘై, మొనాకో, న్యూయార్క్, జెనీవాలో క్రమశిక్షణ ఉల్లంఘ నలకు పాల్పడ్డాడా? లేదా? అంశంపై దర్యాప్తు సంస్థ విచారణ చేసింది. ఆరోపణలను బలపరిచేలా ఎటువంటి ఆధారాలు లభించలేదని దర్యాప్తు నివేదికలో పేర్కొన్నారు. ఆరోపణలను ఖండించిన జ్వెరెవ్, విచారణకు పూర్తి సహకారం అందించాడు.