న్యూఢిల్లీ : భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు, బిజెపి ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక ఆరోపణలు, ఆర్థిక అవకతవకల ఆరోపణలపై విచారణకు కేంద్ర క్రీడాశాఖ నియమించిన పర్యవేక్షణ కమిటీలో మాజీ రెజ్లర్ బబిత ఫోగట్‌ను చేర్చారు. విచారణ కమిటీ ఏర్పాటులో రెజ్లర్లను సంప్రదించలేదని వినేశ్, బజరంగ్, సాక్షి మాలిక్ అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో.. వినేశ్ ఫోగట్ సోదరి, బిజెపి నాయకురాలు బబిత ఫోగట్‌ను కమిటీ సభ్యురాలుగా నియమించారు. దిగ్గజ బాక్సర్ ఎంసీ మేరీకోమ్ నాయకత్వంలోని విచారణ కమిటీ నాలుగు వారాల్లో నివేదిక అందజేయాల్సి ఉంది.