పంజాబ్‌పై ఘన విజయం రాజ్‌కోట్ : సౌరాష్ట్ర రంజీ ట్రోఫీ సెమీఫైనల్‌కు చేరుకుంది. ఉత్కంఠగా సాగిన పంజాబ్‌తో క్వార్టర్‌ఫైనల్లో సౌరాష్ట్ర 71 పరుగుల తేడాతో గెలుపొందింది. 252 పరుగుల ఊరించే ఛేదనలో పంజాబ్ చతికిల పడింది. సౌరాష్ట్ర లెఫ్టార్మ్ స్పిన్నర్ పార్థ్ భట్ (5/89) ఐదు వికెట్లతో మాయజాలం ప్రదర్శించాడు. 89.1 ఓవర్లలో 180 పరుగులకే పంజాబ్ కుప్పకూలింది. మన్‌దీప్ సింగ్ (45), మాన్ (42), మినహా మరో బ్యాటర్ ఛేదనలో రాణించలేదు. సౌరాష్ట్ర వరుసగా 303, 379 పరుగులు చేయగా.. పంజాబ్ తొలి ఇన్నింగ్స్‌లో 431 పరుగులు చేసింది. బ్యాట్‌తో 111, 51 ఇన్నింగ్స్‌లు బాదిన పార్థ్.. బంతితో 8 వికెట్లు పడగొట్టి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో మధ్యప్రదేశ్‌తో బెంగాల్.. కర్ణాటకతో సౌరాష్ట్ర తలపడనున్నాయి.