Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • మామ వేధింపులు..అల్లుడు ఆత్మహత్య
  • ఆ సంతృప్తితోనే మా ఫాదర్ కాలం చేశారు : డైరెక్టర్ బాబీ
  • అక్కినేని నాగచైతన్యతో పెళ్లి వార్తలపై హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ క్లారిటీ
  • జోగులాంబ గ‌ద్వాల జిల్లాలో అంత‌ర్ రాష్ట్ర పొట్టేళ్ల పందెం..
  • తారకరత్నను ఐసీయూ అబ్జర్వేషన్ లో ఉంచారు : చంద్రబాబు
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
నిటిఆయోగ్‌ ఆరోగ్యరంగం ర్యాంకింగ్‌లో.. తెలంగాణ అగ్రస్థానం... ఉత్తర్‌ప్రదేశ్‌ చివరి స్థానం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

నిటిఆయోగ్‌ ఆరోగ్యరంగం ర్యాంకింగ్‌లో.. తెలంగాణ అగ్రస్థానం... ఉత్తర్‌ప్రదేశ్‌ చివరి స్థానం

Sun 27 Nov 04:09:52.844452 2022

- ట్రబుల్‌కు కారణమేంటో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ చెప్పాలి :
టిఫా స్కానింగ్‌ మిషన్ల ప్రారంభోత్సవంలో వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
ఆరోగ్య రంగానికి సంబంధించిన నిటిఅయోగ్‌ విడుదల చేసిన ర్యాంకింగ్‌లో తెలంగాణ అగ్రస్థానంలో ఉంటే, బీజేపీ పాలిత ఉత్తర్‌ప్రదేశ్‌ చివరి స్థానంలో ఉందని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావు విమర్శించారు. శనివారం హైదరాబాద్‌లోని పెట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి నుంచి వర్చువల్‌ పద్ధతిలో రాష్ట్రంలోని 44 ఆస్పత్రుల్లో 56 టిఫా స్కానింగ్‌ మిషన్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సర్కారు డబుల్‌ ఇంజిన్‌ సర్కారంటూ గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీ నాయకులు ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆరోగ్యరంగం ఎందుకు ట్రబుల్‌లో ఉందో చెప్పాలని సవాల్‌ చేశారు. పుట్టబోయే పిల్లల్లో లోపాలను గర్భంలో ఉండగానే గుర్తించేందుకు 'టిఫా' (టార్గెటెడ్‌ ఇమేజింగ్‌ ఫర్‌ ఫీటల్‌ అనామలీస్‌ స్కాన్‌) దోహదం చేస్తుందని తెలిపారు. ''ప్రభుత్వ దవాఖానల్లో ఇప్పటికే 155 ఆల్ట్రా సౌండ్‌ స్కానింగ్‌ మిషన్లు ఉన్నాయి. నెలకు సగటున 11 నుంచి 12 వేల పరీక్షలు జరుగుతున్నాయి.
అయితే వీటిలో గుర్తించలేని లోపాలను టిఫా స్కాన్‌ వల్ల మాత్రమే ఇలాంటివి గుర్తించగలుగుతాం. వీటి కోసం రూ. 20 కోట్లు వెచ్చించాం. దీని కోసం ఇప్పటికే రేడియాలజిస్టులు, గైనకాలజిస్టులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. ప్రయివేటులో టిఫా స్కాన్‌కు రూ. 2000-3000 వరకు వసూలు చేస్తున్నారు. ఇక నుంచి ఈ ఆర్థిక భారం పేదలకు పూర్తిగా తప్పుతుంది. ప్రతి నెల సగటున 20 వేల మంది గర్బిణులు ఈ సేవలు ఉచితంగా వినియోగించుకునే వెసులుబాటు కలుగుతుంది. గర్బిణులకు18 నుంచి 22 వారాల మధ్య ఈ స్కాన్‌ చేయాల్సి ఉంటుంది. నిపుణులైన రేడియాలజిస్టులు లేదా గైనకాలజిస్టులు మాత్రమే ఈ స్కాన్‌ చేస్తారు. గర్బంలోని శిశువు తల నుంచి కాలిబొటన వేలు వరకు ప్రతి అవయవాన్ని ఇందులో భాగంగా స్కాన్‌ చేస్తారు. ఇందుకు కనీసం 20-30 నిమిషాలు పడుతుంది. శిశువు గర్బంలో ఏ పొజిషన్‌లో ఉన్నది, జరాయువు లేదా మావి (ప్లాసెంటా) ఏ ప్రాంతంలో ఉన్నది, ఉమ్మ నీరు స్థితి వంటి వాటిని గుర్తిస్తారు. అంతర్జాతీయ నివేదికలు, వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం... ఏడు శాతం శిశువుల్లో లోపాలుండే అవకాశం ఉంది. అంటే పుట్టే ప్రతి 100 మందిలో ఏడుగురు ఏదో ఒక ఆరోగ్య సమస్యతో ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు 12 లక్షల 66 వేల మంది బాలింతలకు రూ. 263 కోట్లు విలువ చేసే కేసీఆర్‌ కిట్లు, ఆర్థిక సాయం రూ. 1,261 కోట్లుతో కలుపుకుని రూ.1,525 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు.మాతా శిశు ఆరోగ్య సంరక్షణలో భాగంగా కొత్త ఆస్పత్రుల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పన, తదితర అభివద్ధి పనుల కోసం రూ. 403 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. గాంధీ ఆస్పత్రిలో రూ.55 కోట్లతో 200 పడకల ఎంసీహెచ్‌ పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. నిమ్స్‌లో రూ.55 కోట్లతో 200 పడకల ఎంసీహెచ్‌ మంజూరు చేసినట్టు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,900 సబ్‌ సెంటర్లను పల్లె దవాఖానలుగా మార్చుతున్నామనీ, దీంతో 3,800 గ్రామాల్లో డాక్టర్లు ప్రజలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో 2014 లో ప్రభుత్వాస్పత్రుల్లో 30 శాతం ప్రసవాలు జరిగితే ప్రస్తుతం అది 66 శాతానికి పెరిగిందని తెలిపారు. గతేడాది కన్నా ఈ ఏడాది అక్టోబర్‌లో సి-సెక్షన్లు ఏడు శాతం తగ్గాయన్నారు. ఆరగ్యరంగానికి తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందనీ, ఇది గుర్తించకుండా రాష్ట్రానికి వచ్చే బీజేపీ నాయకులు ప్రచారం కోసం ఏదో ఒకటి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హౌంమంత్రి మహమూద్‌ అలీ, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, కుటుంబ ఆరోగ్య సంక్షేమ విభాగం కమిషనర్‌ శ్వేత మహంతి, డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ రమేష్‌ రెడ్డి, టీవీవీపీ కమిషనర్‌ అజరు కుమార్‌, పెట్ల బురుజు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మాలతి, మెటర్నల్‌ హెల్త్‌ జెడి డాక్టర్‌ పద్మజ, ఉస్మానియా మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ శశికళ తదితరులు పాల్గొన్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

హిమాయత్‌నగర్‌లో కుంగిన రోడ్డు
మంత్రి సబిత రాజీనామాకు కుట్ర!
పిల్లల ప్రతిభాపాటవాలకు వేదిక తెలంగాణ బాలోత్సవం
గుడి ధ్వంసంపై ఆదివాసీల ఆగ్రహం
అమరుల ఆశయసాధనకు పునరంకితమవుదాం
9,10 తరగతులకు బోధించలేం
సింగరేణిలో ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్‌ ప్రారంభం
బస్సుల్లో రేడియో ప్రారంభించిన టీఎస్‌ఆర్టీసీ చైర్మెన్‌ వీసీ సజ్జనార్‌
ఎంపీ అవినాశ్‌రెడ్డిని నాలుగు గంటలు విచారించిన సీబీఐ
61 ఏండ్ల వరకు కాంట్రాక్టు అధ్యాపకుల కొనసాగింపు
టీ జూడా నూతన అధ్యక్షునిగా డాక్టర్‌ కౌశిక్‌
విద్యుత్‌ వినియోగదారులపై అదనపు చార్జీలను ఉపసంహరించుకోవాలి
జ్యూట్‌ బోర్డు వద్ద కార్మికుల ధర్నా
గల్ఫ్‌ కార్మికుల సంక్షేమానికి రూ. 500 కోట్లు కేటాయించాలి
అదానీ అవకతవకలపై సెబి, ఈడీ విచారణ జరపాలి
ఆ మూడింటికీ బడ్జెట్‌లో నిధులు కేటాయించండి
ప్రారంభమైన స్టార్టప్‌-20 సమావేశం
గ్రూప్‌-4కు 7.41 లక్షల దరఖాస్తులు
ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్‌ తరహా వైద్యం
కల్వకుంట్ల కవితతో సినీ నటుడు శరత్‌ కుమార్‌ భేటీ
కేసీఆర్‌వి అన్నీ అబద్ధాలే
స్వాతంత్య్ర పోరాటంలో సామాన్యులెందరో...
సాగునీరు పుష్కలం - రాష్ట్రం సస్యశ్యామలం
బ్యాంకింగ్‌ వ్యవస్థలో తిరోగమన విధానాలు
దమ్ముంటే పార్లమెంట్‌ను రద్దు చేసి ముందస్తుకు వెళ్లండి
ఈసారైనా నిధులు పెరిగేనా?
'మన ఊరు-మనబడి' పనులు త్వరగా పూర్తి చేయాలి
నేతలు గెలుస్తున్నారు.. ప్రజలు ఓడుతున్నారు..
ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం ఫిబ్రవరి 9న హైదరాబాద్‌లో మహాధర్నా
మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి..
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.