రాందేవ్ బాబాపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి : సునీతారావు
Sun 27 Nov 04:33:58.298886 2022
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాందేవ్ బాబాపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు సునీతారావు డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్ వద్ద రాందేవ్ బాబా దిష్టిబోమ్మను దహనం చేశారు. ఈసందర్భంగా సునీతారావు మాట్లాడుతూ మహిళల గురించి ఇలా మాట్లాడం తగదన్నారు. ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గీతారెడ్డి, నాయకులు వరలక్ష్మి, ఉన్నారు.